RRR: ‘కొమురం భీముడో’ పాట వెనక అంత ఎమోషన్ దాగి ఉందా?

RRR: టాలీవుడ్​ టాప్​ మోస్ట్ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్​ర్​ఆర్​ఆర్​. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్​చరణ్​, తారక్​ హీరోలుగా వస్తోన్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు. ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్​ను భారీగా ప్లాన్​ చేశారు రాజమౌళి. కాగా, ఇటీవలే విడుదలైన ట్రైలర్​తో సినిమాపై అంచనాలు ఎక్కడికో  వెళ్లిపోయాయి. కాగా, ఇటీవలే గోండు […]

Written By: Raghava Rao Gara, Updated On : December 27, 2021 2:27 pm
Follow us on

RRR: టాలీవుడ్​ టాప్​ మోస్ట్ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్​ర్​ఆర్​ఆర్​. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్​చరణ్​, తారక్​ హీరోలుగా వస్తోన్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు. ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్​ను భారీగా ప్లాన్​ చేశారు రాజమౌళి.

కాగా, ఇటీవలే విడుదలైన ట్రైలర్​తో సినిమాపై అంచనాలు ఎక్కడికో  వెళ్లిపోయాయి. కాగా, ఇటీవలే గోండు బెబ్బులి కొమురం భీమ్ త్యాగాన్ని వివరిస్తూ.. కొమురం భీముడో పాటను ఆర్​ఆర్​ఆర్ టీమ్ రిలీజ్ చేసిన సంగతి అందిరకీ తెలిసిందే. ఈ పాట వింటున్న ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనయ్యారు. అందుకు ప్రధాన కారణం లిరిక్స్​.

NTR

సుద్దాల అశోక్ తేజ రచించిన ఈ లిరిక్స్​ వెనకున్న కథను వివరిస్తూ.. ఓ మీడియాలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కొమురం భీమ్​ని బ్రిటిష్​ వాళ్లు చిత్రహింసలు పెడుతున్నప్పుడు.. తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ ఈ పాట వస్తుంది. ఈ పాట రాసేముందు కొమురంభీమ్ ధైర్యాన్ని, అడవి వీరుల వారసత్వాన్ని, ఆయన తెగింపును, ఓవరాల్​గా ఆయన జీవితాన్ని పదాల రూపంలో రాసే ప్రయత్నం చేశా.. అంటూ సుద్దాల చెప్పుకొచ్చారు. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్​కు చేరుకుంది. ప్రస్తుతం ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్స్​లో ఫుల్ బిజిగా ఉన్నారు టీమ్​. త్వరలోనే తెలుగులోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్​ను నిర్వహించనున్నారు.