Thammudu Movie : ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోలలో నితిన్(Hero Nithin) పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. మంచి ప్రొడక్షన్ హౌసెస్ లో సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ, హిట్స్ మాత్రం పడట్లేదు. ‘భీష్మ’ చిత్రం తర్వాత వరుసగా 5 డిజాస్టర్ సినిమాలు తగిలాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న గత చిత్రం ‘రాబిన్ హుడ్’ కమర్షియల్ గా మరో భారీ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఫలితం నితిన్ మనసుని బాగా కృంగదీసింది. ఈ చిత్రం తర్వాత ఆయన వేణు శ్రీరామ్(Venu Sriram) దర్శకత్వం లో దిల్ రాజు(Dil Raju) నిర్మాత గా ‘తమ్ముడు'(Thammudu Movie) అనే చిత్రం లో హీరోగా నటించాడు. ఈ సినిమా జులై 4న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఇందులో సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్ర పోషించింది. అదే విధంగా కాంతారా ఫేమ్ సప్తమి గౌడ ఇందులో హీరోయిన్ గా నటించింది.
‘తమ్ముడు’ అనే టైటిల్ ని ప్రకటించినప్పుడు, ఆడియన్స్ అందరూ ఈ నితిన్ కి ఏమి పనిలేదా?, అన్నీ రొటీన్ సబ్జక్ట్స్ చేస్తున్నాడు అని అనుకున్నారు. కానీ ట్రైలర్ విడుదల తర్వాత తమ్ముడు పై అంచనాలు పూర్తిగా మారిపోయాయి. వేణు శ్రీరామ్ ఎదో కోత తరహా కాన్సెప్ట్ ని సిద్ధం చేసాడు. కచ్చితంగా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా, నితిన్ ఈ చిత్రం తో భారీ కం బ్యాక్ చాలా బలంగా ఇవ్వబోతున్నాడని నిర్మాత దిల్ రాజు బలమైన విశ్వాసం వ్యక్తం చేసాడు. ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా ప్రొమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తున్నాడు. రీసెంట్ గా నితిన్ తో కలిసి ఆయన ఒక ఇంటర్వ్యూ చేసాడు. ఈ ఇంటర్వ్యూ లో నితిన్ దిల్ రాజు ని చాలా బోల్డ్ ప్రశ్నలు అడిగాడు. ఉన్నది ఉన్నట్టు ముఖం మీదనే చెప్పే అలవాటు ఉన్న దిల్ రాజు,ఈ ఇంటర్వ్యూ లో కూడా అదే చేసాడు.
ముందుగా నితిన్ ఒక ప్రశ్న అడుగుతూ ‘అప్పటి నితిన్ కి..ఇప్పటి నితిన్ కి మారింది ఏమైనా ఉందా?’ అని అడగ్గా, దానికి దిల్ రాజు మాట్లాడుతూ ‘నా పాతికేళ్ల కెరీర్ లో ఒక నిర్మాతగా నేడు ఎలాంటి టాప్ స్థానం లో కూర్చొని ఒక బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించుకున్నాను. నువ్వు నా కంటే ఒక సంవత్సరం ఇండస్ట్రీ లో సీనియర్ వి. కానీ నువ్వు అలాంటి బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోలేకపోయావ్. దిల్ , ఆర్య సినిమాలు చేస్తున్నప్పుడు అల్లు అర్జున్,నితిన్ భవిష్యత్తులో కాబోయే పెద్ద సూపర్ స్టార్స్ అని అప్పట్లో అనుకున్నాను. కానీ నువ్వు ఆ స్థాయికి చేరుకోవడం లో విఫలం అయ్యావు అనేది నా ఫీలింగ్’ అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు నితిన్ సమాధానం ఇస్తూ ‘తమ్ముడు తో నాకు మళ్ళీ ఆ పూర్వ వైభవం వస్తుంది అంటారా?’ అని అడగ్గా, తమ్ముడు చిత్రం తో సక్సెస్ కొడుతావు, ఎల్లమ్మ చిత్రం తో నువ్వు కోరుకున్న రేంజ్ కి వెళ్తావు అంటూ చెప్పుకొచ్చాడు.
“నువ్వు #AlluArjun లా achieve చెయ్యలేపోయావ్…”#DilRaju bluntly said when #Nithiin asked about his negatives. pic.twitter.com/aWousWFLUJ
— Gulte (@GulteOfficial) June 30, 2025