https://oktelugu.com/

Stree 2 Collection: బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్న స్త్రీ 2… అంతగా ఈ సినిమాలో ఏముంది? కథ ఇదే!

ఓ మీడియం బడ్జెట్ మూవీ బాలీవుడ్ కి ఊపిరి పోసింది. స్త్రీ 2 బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. కేవలం వారం రోజుల వ్యవధిలో రూ. 800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతగా ప్రేక్షకులు ఇష్టపడటానికి కారణం ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : August 24, 2024 / 01:49 PM IST

    Stree 2 Collection(1)

    Follow us on

    Stree 2 Collection: సినిమాలో విషయం ఉంటే భారీ బడ్జెట్, స్టార్ క్యాస్ట్ అవసరం లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా సినిమాలు నిరూపించాయి. కేవలం రూ. 16 కోట్లతో తెరకెక్కించిన కాంతార వరల్డ్ వైడ్ రూ. 400 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. ఆ లెక్కన ఎన్ని వందల రెట్లు లాభాలు కాంతార పంచిందో అంచనా వేయవచ్చు. తెలుగులో జాతిరత్నాలు, గీతగోవిందం, ఉప్పెన, టిల్లు స్క్వేర్, బేబీ వంటి చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలు భారీ లాభాలు పంచాయి.

    తాజాగా బాలీవుడ్ లో ఓ మీడియం బడ్జెట్ మూవీ ఏకంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కిన స్త్రీ 2 సంచనాలు చేస్తుంది. ఆగస్టు 15న స్త్రీ 2 విడుదలైంది. రాజ్ కుమార్ రావు, శ్రద్దా కపూర్ హీరో హీరోయిన్స్ గా నటించారు. పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర శక్తి ఖురానా కీలక రోల్స్ చేశారు. స్త్రీ 2 చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకుడు.

    రూ. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన స్త్రీ 2 రూ. 8 రోజుల్లో రూ. 400 కోట్లు రాబట్టింది. 2018లో వచ్చిన స్త్రీ చిత్రానికి స్త్రీ 2 కొనసాగింపు. స్త్రీ చిత్రంలో సైతం రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. కేవలం రూ. 25 కోట్లతో స్త్రీ చిత్రం తెరకెక్కించాడు దర్శకుడు అమర్ కౌశిక్. ఫుల్ రన్ లో స్త్రీ రూ. 181 కోట్ల వసూళ్లు రాబట్టింది. ప్రేక్షకులకు ఒక సరికొత్త చిత్రాన్ని దర్శకుడు అందించాడు. స్త్రీ ఏకంగా 10 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకుంది.

    స్త్రీ చిత్రం కథ విషయానికి వస్తే… చందేరి అనే గ్రామానికి చెందిన ఓ స్త్రీ ప్రతీకారం తీర్చుకోవడం కోసం దెయ్యంగా మారుతుంది. గ్రామంలోని పురుషులను ఒక్కొక్కరిగా మాయం చేస్తుంది. దాంతో ఆ గ్రామంలోని ప్రతి ఇంటి గోడ మీద ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాస్తారు. ఆ దెయ్యం పీడ వదిలించాలని విక్కీ(రాజ్ కుమార్ రావు) భావిస్తాడు. ఆ ఊరిలోకి కొత్తగా వచ్చిన యువతి(శ్రద్దా కపూర్)ని ఆ దెయ్యం అనుకుంటాడు. చివరికి విక్కీ ఫ్రెండ్ ని కూడా ఆ దెయ్యం అపహరిస్తుంది. ఆ దెయ్యంని ఎలా కట్టడి చేశారు అనేది పార్ట్ 1 కథ.

    స్త్రీ 2 అక్కడి నుండి మొదలవుతుంది. స్త్రీ పీడ విరగడంతో చండేరీ గ్రామ ప్రజలు ఆనందంగా జీవిస్తూ ఉంటారు. వారి సంతోషాన్ని దూరం చేస్తూ సర్కట(మొండెం లేని తల)ఎంట్రీ ఇస్తాడు. చందేరి గ్రామంలో మోడ్రన్ గా ఉన్న అమ్మాయిలను అపహరిస్తూ ఉంటాడు. సర్కట ఆటలు విక్కీ ఎలా కట్టించాడు అనేది స్త్రీ 2. ఫుల్ రన్ ముగిసే నాటికి ఈ చిత్రం మరిన్ని సంచలనాలు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.