https://oktelugu.com/

Harish Shankar: హరీష్ శంకర్ నోటిదూల వల్లే మా ‘మిస్టర్ బచ్చన్’ ప్లాప్ అయ్యింది అంటూ నిర్మాత ఆందోళన!

ఫ్లాప్స్ అనేవి హరీష్ శంకర్ అనే డైరెక్టర్ కి మాత్రమే కాదు, ఎవరికైనా వస్తాది. కానీ విపరీతమైన యాటిట్యూడ్ ధోరణితో ముందుకు పొతే హరీష్ శంకర్ కి నష్టం తప్ప లాభం చేకూర్చదు. అద్భుతమైన సినిమా తీసిన డైరెక్టర్స్ కూడా హరీష్ శంకర్ లాగ మాట్లాడరు అనేది వాస్తవం.

Written By:
  • Vicky
  • , Updated On : August 24, 2024 / 01:42 PM IST

    Harish Shankar

    Follow us on

    Harish Shankar: మాస్ మహారాజ రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కనీసం రవితేజ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది. ఇవన్నీ పక్కన పెడితే ఈ చిత్రాన్ని నిర్మించిన ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాయి. ఆయన మాట్లాడుతూ ‘మిస్టర్ బచ్చన్ చిత్రం అంత పెద్ద ఫ్లాప్ అయ్యే సినిమా మాత్రం కాదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా వచ్చింది, పాటలు బాగున్నాయి, సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పింది. కానీ హరీష్ శంకర్ కాస్త నోటిని అదుపులో పెట్టుకొని ఉండుంటే ఈరోజు ఈ చిత్రం ఇంత పెద్ద ఫ్లాప్ అయ్యేది కాదు. ప్రొమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ లో కొంతమంది విలేఖరులపై విరుచుకుపడి మాట్లాడిన తీరు మా సినిమాపై నెగటివ్ రివ్యూస్ దండయాత్ర చెయ్యడానికి దోహదపడ్డాయి. ఆయన మాటలకు అందరూ మా మిస్టర్ బచ్చన్ చిత్రంపై కసి చూపించి మరీ దారుణమైన రేటింగ్స్ ఇచ్చారు. అది మా సినిమా వసూళ్లపై తీవ్రమైన ప్రభావం చూపించింది. సినిమాలో విషయం ఉండుంటే తాము ఆ రేటింగ్స్ పై పోరాడేవాళ్ళం. కానీ మాకు ఆ అవకాశం లేకుండా పోయింది’ అంటూ విశ్వప్రసాద్ ఈ సందర్భంగా తన ఆవేదనని వ్యక్తపరిచాడు

    ఫ్లాప్స్ అనేవి హరీష్ శంకర్ అనే డైరెక్టర్ కి మాత్రమే కాదు, ఎవరికైనా వస్తాది. కానీ విపరీతమైన యాటిట్యూడ్ ధోరణితో ముందుకు పొతే హరీష్ శంకర్ కి నష్టం తప్ప లాభం చేకూర్చదు. అద్భుతమైన సినిమా తీసిన డైరెక్టర్స్ కూడా హరీష్ శంకర్ లాగ మాట్లాడరు అనేది వాస్తవం. ఒక ప్రముఖ జర్నలిస్టుకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన తీరు సినిమాకి హైప్ ని తీసుకొచ్చి ఓపెనింగ్స్ కి కలిసి వస్తాయని అనుకున్నాడు కానీ, అది మిస్ ఫైర్ అయ్యింది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ లో వచ్చిన టాక్ వల్ల ఓపెనింగ్స్ పై తీవ్రమైన ప్రభావం పడింది. దానివల్ల మొదటి రోజు వసూళ్లు 8 కోట్ల రూపాయలకు పైగా రాబట్టేంత సత్తా ఉన్న ఈ సినిమా కేవలం నాలుగు కోట్ల రూపాయలకు మాత్రమే పరిమితమైంది.

    సినిమాకి వస్తున్న ఏ స్థాయిలో ఉన్నాయో హరీష్ శంకర్ కి తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ఫ్లాప్ టాక్ వచ్చిన మరుసటి రోజే అభిమానులతో లైవ్ ఇంటరాక్షన్ పెట్టాడు. నేను తీసిన సినిమా అంత గొప్పది కాదు, అంత చెత్త సినిమా కూడా కాదు. మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చిన విషయం వాస్తవమే, కానీ ఇప్పుడు వసూళ్లు బాగున్నాయి, టాక్ పెరిగింది, అందుకే మీ ముందు ఇలా కూర్చున్నాను అని అంటాడు హరీష్. ఈ మాటలు ఇంకా మిస్ ఫైర్ అయ్యింది. ఈ కాలం లో సోషల్ మీడియా ని వాడని వారంటూ ఉంటారా చెప్పండి?, హరీష్ శంకర్ చెప్పేవి అబద్దాలు అని వాళ్ళు కనిపెట్టలేరా?,హరీష్ శంకర్ కి ఉన్న ఈ అతి ధోరణియే అతని పతనానికి కారణం అవుతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.