Marco : గత ఏడాది విడుదలైన మలయాళం యాక్షన్ చిత్రం ‘మార్కో'(Marco Movie) ఇప్పుడు అనేక సమస్యలను ఎగురుకుంటూ ఉంటుంది. టీవీ టెలికాస్ట్ కి CBFC నిరాకరించింది. అదే విధంగా ఈ సినిమా ఓటీటీ లో కూడా బ్యాన్ చేయాల్సిందిగా కేరళ ప్రభుత్వం కేంద్ర I&B మినిస్టర్ కి లేఖ కూడా రాసింది. ఇంతటి హింసాత్మకంగా సినిమాని జీవితం లో ఎప్పుడూ చూడలేదని, ఇలాంటి సినిమాకి అసలు సెన్సార్ బోర్డు ఎలా సర్టిఫికేట్ జారీ చేసి థియేటర్స్ లో ప్రదర్శించుకోవడానికి అనుమతిని ఇచ్చింది?, ఇది చాలా పెద్ద పొరపాటు అంటూ విశ్లేషకులు సెన్సార్ బోర్డు తీరుని తప్పుబడుతున్నారు. సినిమాని తీసిన దర్శక నిర్మాతలకంటే, ఈ సినిమాని అనుమతించిన సెన్సార్ బోర్డు కి నేడు అత్యధిక ప్రశ్నలు ఎదురు అవుతున్నాయి. సెన్సార్ బోర్డు(Censor Board) మెంబెర్స్ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అలాంటి సన్నివేశాలు ఉంటాయి ఆ సినిమాలో.
Also Read : ‘మార్కో’ లాంటి చెత్త సినిమా నా జీవితంలో చూడలేదు..సినిమా మధ్యలోనే థియేటర్ నుండి వెళ్లిపోయాం : కిరణ్ అబ్బవరం
ఇలా అన్ని వైపుల నుండి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఇక మీదట సెన్సార్ సభ్యులు యాక్షన్ మూవీస్ పట్ల చాలా కఠినంగా వ్యవహరించబోతున్నట్టు టాక్. టీవీ టెలికాస్ట్ సమయంలో హింసాత్మక సన్నివేశాలకు ఏ రేంజ్ సెన్సార్ కట్స్ వేసేవారో, అంతకు మించిన కట్స్ ఇక నుండి ఉండబోతున్నాయట. దీంతో యాక్షన్ మూవీ మేకర్స్ గుండెల్లో గుబులు మొదలైంది. ఇలా అయితే పర్ఫెక్ట్ థియేట్రికల్ అనుభూతి ఆడియన్స్ పొందలేరని, ‘మార్కో’ తరహా హింస గతంలో ఏ సినిమాలో కూడా చూడలేదని, తమ సినిమాల్లో ఆ రేంజ్ వయొలెన్స్ ఉండదని ఇప్పటి నుండే సెన్సార్ బోర్డు సబ్యులకు అర్జీలు పెట్టుకుంటున్నారట.
కానీ సెన్సార్ సభ్యులు మాత్రం హై కోర్టు, సుప్రీమ్ కోర్టు స్థాయికి వెళ్లే వరకు పరిస్థితులు కొని తెచ్చుకునే ఉద్దేశ్యాలు లేవని, ఇక నుండి ఇదే రూల్ అన్ని యాక్షన్ మూవీస్ కి అనుసరిస్తామని అంటున్నారట. రాబోయే రోజుల్లో ‘ఓజీ’, ‘స్పిరిట్’, ‘ఎనిమల్ పార్క్’, ‘సలార్ 2’ ఇలా ఎన్నో యాక్షన్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలకు ఈ రేంజ్ కట్స్ విధిస్తే పరిస్థితి ఏమిటి అని భయపడిపోతున్నారు మేకర్స్. మొత్తానికి ఒక మలయాళం యాక్షన్ సినిమా వల్ల ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం రిస్క్ లో పడినట్టు అయ్యింది. భవిష్యత్తులో సెన్సార్ బోర్డు ఫిల్మ్ మేకర్స్ విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని ఏవైనా సవరణలు చేసే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి.
Also Read : సెల్ఫీ అడిగితే ఫోన్ లాక్కొని జేబులో వేసుకొని వెళ్లిపోయిన ‘మార్కో’ హీరో..వైరల్ అవుతున్న వీడియో!