https://oktelugu.com/

బాపుబొమ్మకు వింత శబ్దాలు.. త్వరలోనే చెబుతుందట !

బాపుబొమ్మ అంటే ఒక‌ప్పుడు చాలామంది హీరోయిన్లే గుర్తొచ్చే వారు. కానీ, ఈ జనరేషన్ లో మాత్రం ఆ క్రెడిట్ ఒక్క ‘ప్రణీత సుభాష్’ కే దక్కింది. ఐదేళ్ల కిందట “అత్తారింటికి దారేది”లో ఈ భామ కనిపిస్తే.. నిజంగానే బాపుబొమ్మ‌లా ఉంది.. పెద్ద పెద్ద కళ్లతోటి.. అనే పాట పవన్ కళ్యాణ్ ఆమె కోసం నిజంగానే పాడొచ్చు, ఏ మాత్రం తప్పు లేదు అంటూ నెటిజన్లు కూడా ‘ప్రణీత సుభాష్’ రూపురేఖలకు ఫిదా అయిపోయారు. అయితే అన్ని ఉన్నా […]

Written By:
  • admin
  • , Updated On : September 23, 2020 / 02:11 PM IST
    Follow us on


    బాపుబొమ్మ అంటే ఒక‌ప్పుడు చాలామంది హీరోయిన్లే గుర్తొచ్చే వారు. కానీ, ఈ జనరేషన్ లో మాత్రం ఆ క్రెడిట్ ఒక్క ‘ప్రణీత సుభాష్’ కే దక్కింది. ఐదేళ్ల కిందట “అత్తారింటికి దారేది”లో ఈ భామ కనిపిస్తే.. నిజంగానే బాపుబొమ్మ‌లా ఉంది.. పెద్ద పెద్ద కళ్లతోటి.. అనే పాట పవన్ కళ్యాణ్ ఆమె కోసం నిజంగానే పాడొచ్చు, ఏ మాత్రం తప్పు లేదు అంటూ నెటిజన్లు కూడా ‘ప్రణీత సుభాష్’ రూపురేఖలకు ఫిదా అయిపోయారు. అయితే అన్ని ఉన్నా తెలుగులో మాత్రం ఈ బాపుబొమ్మ స్టార్ హీరోయిన్ కాలేక‌పోయింది. “అత్తారింటికి దారేది” ఇచ్చిన సక్సెస్ తో వ‌ర‌స‌గా కొన్ని సినిమాల్లో మెరిసినా ఎక్కువుగా సెకండ్ హీరోయిన్‌ గానే ఫిక్సైపోవాల్సి వచ్చింది. ఈ సినిమా ఇండస్ట్రీకి అస్సలు కరుణ లేదు, లేకపోతే.. అంత గొప్ప అందగత్తెను సెకెండ్ హీరోయిన్ కే ఎలా పరిమితం చేయగలుగుతుంది.

    Also Read: సుశాంత్ రూ.12కోట్లు అడిగాడు.. ఎందుకంటే?

    ఏది ఏమైనా ప్రస్తుతం ప్రణీత సినిమాలతో బిజీగా లేకపోయి ఉండొచ్చు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె ట్రెండింగ్‌ లో కొనసాగడం విశేషం. ఈ కరోనా మహమ్మారి కాలంలో స్టార్ హీరోయిన్లందరూ ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే.. ప్రణీత మాత్రం నడివీధుల్లో తిరుగుతూ… ఎక్కడ ఎవరు పస్తులతో పడుకుంటున్నారో అక్కడికి వెళ్లి వారికి అన్నం పెట్టి తన మనసు మంచిందని నిరూపించుకుంది. స్టార్ హీరోయిన్లతో పోల్చుకుంటే ప్రణీతకు ఆస్తి, ఫేమ్, క్రేజ్ తక్కువగా ఉండొచ్చేమో గానీ, మంచితనంలో, మానవత్వంలో, సేవా గుణంలో మాత్రం ప్రణీతకు ఏ స్టార్ హీరోయిన్ సరిపోదు. ఇక తాజాగా ఈ బాపు బొమ్మ ఓ వీడియోను పోస్ట్ చేసింది.

    Also Read: మోనాల్, సుజాతలతో అవినాష్ పులిహోర ట్రాక్స్ !

    తానూ యోగా చేస్తుండగా ఆమెకు ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయట. మరి ఆ శబ్దాలు ఏమిటో అని కనిపెట్టేందుకు చాలానే కష్టపడున్నానని అంటుంది. అయితే ఓ కన్ను మూసి, మరో కన్ను తెరిచి దొంగలా చూస్తున్నా కూడా ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయో కనిపెట్టలేకపోయిందట ఈ బ్యూటి. ఇదే విషయాన్ని నెటిజన్లతో పంచుకుంటూ.. ఎవరికి తెలియని ఆ వింత శబ్దాలను త్వరలోనే కనిపెట్టి చెబుతానని చెప్పుకొచ్చింది. మరి ఆ శబ్దాలు ఏ ఆకలి కేకలో అయి ఉంటాయని.. కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.