https://oktelugu.com/

టాలీవుడ్ కు శాపం.. సంక్రాంతి కూడా పాయే..

కరోనాతో అన్నింటికంటే బాగా ఎఫెక్ట్ అయ్యింది సినిమా పరిశ్రమనే. థియేటర్లు మూతపడి.. షూటింగ్ లు బంద్ పడి వేల కోట్ల రూపాయల బిజినెస్ జరిగే సినీ పరిశ్రమ ఇప్పటికీ కోలుకోవడం లేదు. కరోనాతో ప్రపంచం తేరుకొని అన్ లాక్ లు కొనసాగుతున్నా సినిమా ఇండస్ట్రీ మాత్రం ఓపెన్ కాని దుస్థితి నెలకొంది. ఇప్పటికే దేశ సినీ ఇండస్ట్రీకి వేసవి సీజన్ పోయింది. తాజాగా దసరాకు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు. ఇక అందరూ సంక్రాంతికి పెద్ద […]

Written By:
  • NARESH
  • , Updated On : September 23, 2020 / 02:13 PM IST

    Tollywood film Industry

    Follow us on

    కరోనాతో అన్నింటికంటే బాగా ఎఫెక్ట్ అయ్యింది సినిమా పరిశ్రమనే. థియేటర్లు మూతపడి.. షూటింగ్ లు బంద్ పడి వేల కోట్ల రూపాయల బిజినెస్ జరిగే సినీ పరిశ్రమ ఇప్పటికీ కోలుకోవడం లేదు. కరోనాతో ప్రపంచం తేరుకొని అన్ లాక్ లు కొనసాగుతున్నా సినిమా ఇండస్ట్రీ మాత్రం ఓపెన్ కాని దుస్థితి నెలకొంది.

    ఇప్పటికే దేశ సినీ ఇండస్ట్రీకి వేసవి సీజన్ పోయింది. తాజాగా దసరాకు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు. ఇక అందరూ సంక్రాంతికి పెద్ద సినిమాలు లాక్ చేయగా.. అప్పటికీ కరోనా వ్యాక్సిన్ వచ్చేలా లేదు.  దీంతో సంక్రాంతి నుంచి కూడా తాజాగా చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ తప్పుకుంది. వచ్చే వేసవికి సినిమాను వాయిదావేశారు.

    ఇక డార్లింగ్ ప్రభాస్ కూడా తన ‘రాధేశ్యామ్’ సినిమాను సంక్రాంతికి అనుకొని తాజాగా వేసవికి వాయిదా వేశారు. ఇక పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ విషయంలోనూ స్పష్టత లేకపోయింది.

    తెలుగు సినిమాతో అన్ని సినిమాల ఇండస్ట్రీలకు సంక్రాంతి మంచి సీజన్. పోయిన సంక్రాంతికి, ‘అల వైకుంఠపురం’, ‘సరిలేరు నీకెవ్వురు’ రెండూ కూడా చెరో 200 కోట్లు వసూళ్లు చేసి సంచలనం సృష్టించాయి. కానీ ఈసారి కరోనా తో సంక్రాంతి సీజన్ కూడా తుడుచుపెట్టుకుపోయే ప్రమాదంలో ఉంది.

    కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు లేకపోవడం.. థియేటర్లు తెరిచే చాన్స్ లేకపోవడం.. ఇప్పట్లో జనాలు థియేటర్లకు వచ్చే పరిస్థితులు లేవు. దీంతో ఈ సంక్రాంతి సీజన్ కూడా కోల్పోయినట్టేనని.. సినీ ఇండస్ట్రీకి వందల కోట్ల నష్టం అని సినీ పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి.