Homeఎంటర్టైన్మెంట్Hero Siddarth: ఫ్యాన్స్​ కూడా కాటేస్తారంటున్న హీరో సిద్ధార్థ్​.. సామ్​ గురించేనా?

Hero Siddarth: ఫ్యాన్స్​ కూడా కాటేస్తారంటున్న హీరో సిద్ధార్థ్​.. సామ్​ గురించేనా?

Hero Siddarth: తన భావాలను వ్యక్తపరూస్తోంది సామ్​. ఈ క్రమంలోనే ఇప్పటికీ వీరిద్దరి టాపిక్ ట్రెండింగ్​లో నడుస్తోంది. సామ్​ ఏ పోస్ట్ పెట్టినా.. విడాలుకలకు లింక్​ పెడుతూ..నెటిజన్లు కామెంట్లు చేయడం.. హాట్​ టాపిక్​గా మారింది. వీరి విడాకులపై పలువురు సినీ ప్రముఖలు అప్పుడప్పుడు ఇన్​డైరక్ట్​గా రియాక్ట్​ అయిన సందర్భాలూ ఉన్నాయి.

Hero Siddarth
Hero Siddarth

తాజాగా, సామ్ విడాకులపై స్పందిస్తూ.. తన వ్యక్తిగత జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలతో 2021 సంవత్సరం ఎంతో కష్టంగా గడిచిందని.. దీంతో తన భవిష్యత్తుపై ఎలాంటి ఆశలు లేవని చెప్పుకొచ్చింది. మరోవైపు నెటిజన్లు చేస్తున్న ట్రోల్స్​పై స్పందించిన సామ్.. సోషల్​మీడియా అనేది నటీనటులను తమ అభిమానులకు దగ్గర చేస్తుందని.. అలా తమ జీవితంలో ఫ్యాన్స్ భాగమైపోతారని చెప్పింది. కానీ, మరికొంత మంది కావాలనే బాధకలిగించే మాటలు మాట్లాడటం సరికాదని పేర్కొంది. తను చేసే ప్రతి విషయాన్ని యాక్సెప్ట్ చేయాలని ఎప్పుడూ కోరనని.. కానీ అభిప్రాయాలు నచ్చకపోతే.. దాన్ని చెప్పే విధానం వేరేలా ఉంటుందని చెప్పుకొచ్చింది.

Also Read: ఎక్స్ పోజింగ్ లో విశ్వరూపం చూపిస్తోన్న సమంత !

అయితే, తాజాగా, హీరో సిద్ధార్థ్​ చేసిన ట్వీట్​.. సామ్​ను పరోక్షంగా ఉద్దేశించి కౌంటర్​ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సోషల్​మీడియా ప్రపంచంలో కొందరు స్టార్స్​.. అభిమానుల గ్రూప్స్​ నిర్వహంచడం కోసం, వారిని ఆయుధాలుగా మార్చుకోవడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. చివరకు తమ అభిమానులు తమనే కాటేసే ప్రమాదం కూడా ఉందని అర్థం చేసుకోవాలని అన్నారు. ఇకైనా ప్రేమ, ద్వేషాన్ని కొనుగోలు చేయడం మానేయాలని.. ట్వీట్​ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్​ నెట్టింట వైరల్​గా మారింది. సామ్​- చై విడిపోతున్నప్పుడు కూడా సిద్ధార్థ తనదైన స్టైల్​లో ట్వీట్ చేశారు.

Also Read: చచ్చిపోతానేమో అనుకున్నా.. చైతన్య విడాకులపై సమంత సంచలన వ్యాఖ్యలు

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version