https://oktelugu.com/

Pushpa: పుష్ప సినిమా రన్​టైమ్​పై ఇంట్రెస్టింగ్ అప్​డేట్​

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న సినిమా ‘పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. కాగా రెండు బాగాలుగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం పుష్ప – ది రైజ్ ని డిసెంబర్ 17 న భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్​ భారీగా అంచనాలు పెంచింది. ఫుల్​ మాస్​ రోల్​లో కనిపించిన బన్నీ.. తన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 9, 2021 / 12:20 PM IST
    Follow us on

    Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న సినిమా ‘పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. కాగా రెండు బాగాలుగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం పుష్ప – ది రైజ్ ని డిసెంబర్ 17 న భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్​ భారీగా అంచనాలు పెంచింది. ఫుల్​ మాస్​ రోల్​లో కనిపించిన బన్నీ.. తన యాక్టింగ్​తో రికార్డులు బద్దలు కొట్టడం గ్యారెంటీ అంటున్నారు అభిమానులు. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక గా చేస్తుంది. ఈ సినిమాలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, కన్నడ హీరో ధనుంజయ, సునీల్, అనసూయ, అజయ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    Pushpa

    తాజాగా ఈ సినిమా నిడివపై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమాను కూడాా సుకుమార్​ కాస్త లెంత్​ పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎప్పుడూ తన సినిమాలో లేని విధంగా మూడు గంటల నిడివి వచ్చే విధంగా ప్లాన్​ చేసినట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

    Also Read: బాలీవుడ్ లో మల్టీస్టారర్ కి రెడీ అవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

    అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ పై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. స్టార్ హీరోయిన్ సమంత ఓ స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్ తో పాటు స్టెప్పులేయనుంది.

    Also Read: ‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలొచ్చాయ్..’ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ బీభత్సం