https://oktelugu.com/

కలియుగ కర్ణుడు ‘సోనూసూద్’కి విగ్రహం ఏర్పాటు !

చైనా నుండి కరోనా మహమ్మారి దావానలంగా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెంది, సమస్త మానవ జాతిని ముప్పు తిప్పలు పెడుతూ దొరికిన వారిని దొరికినట్టుగా పొట్టన పెట్టుకుంటూ దేశ స్థితి గతులని అస్తవ్యస్తం చేస్తున్న తరుణంలో జాతి సంరక్షణకై అన్ని దేశాలు ఎక్కడిక్కడ లాక్ డౌన్ లు పెట్టి కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయటానికి ప్రయత్నించాయి. ఆ సమయంలో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకి కదలటానికి కూడా లేకుండా చర్యలని పాటించాయి ప్రభుత్వాలు. బ్రతుకుదెరువు కోసం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 21, 2020 3:56 pm
    Follow us on

    sonu sood
    చైనా నుండి కరోనా మహమ్మారి దావానలంగా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెంది, సమస్త మానవ జాతిని ముప్పు తిప్పలు పెడుతూ దొరికిన వారిని దొరికినట్టుగా పొట్టన పెట్టుకుంటూ దేశ స్థితి గతులని అస్తవ్యస్తం చేస్తున్న తరుణంలో జాతి సంరక్షణకై అన్ని దేశాలు ఎక్కడిక్కడ లాక్ డౌన్ లు పెట్టి కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయటానికి ప్రయత్నించాయి. ఆ సమయంలో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకి కదలటానికి కూడా లేకుండా చర్యలని పాటించాయి ప్రభుత్వాలు. బ్రతుకుదెరువు కోసం , ఉన్నత చదువుల కోసం విదేశాలకి వెళ్ళినవారు, ఆఖరికి పండుగలకు పబ్బాలకి బంధువుల ఇంటికి వెళ్లిన వారు కూడా ఎక్కడ వారు అక్కడ ఇరుక్కిపోయి నానా కష్టాలు పడ్డారు.ఇక కూలి పనులు కోసం సొంత ఊర్లని వదిలి పక్క రాష్ట్రాలకి వెళ్లి పనులు చేసుకుని బ్రతికే పేద ప్రజల పరిస్థితి మరీ దారుణమైంది.

    Also Read: డిజిటల్ డెబ్యూకు సిద్ధమవున్న ఐశ్వర్యరాయ్..!

    అలాంటి‌ సమయంలో కష్టాల్లో ఉన్నఅనేక మందికి విశేషమైన సేవలందించారు బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌. విదేశాల నుండి రాలేక ఎయిర్పోర్ట్ లలోనే ఇరుక్కుపోయిన కొంతమందిని దేశానికి తీసుకు రావటం, వలస కార్మికులను సొంత ఊళ్ళకి పంపటం, ఉద్యోగం పోయి రోడ్డున పడిన వారికి ఉద్యోగం ఇప్పించటం, ఇలా అనేక మందికి అనేక విధాలుగా ఆయన సాయం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే “కలియుగ కర్ణుడు” మాదిరి దాన ధర్మాలు చేశారు సోను సూద్. సినిమాలలో విలన్ పాత్రలలో క్రూరుడిగా కనిపించే సోనూసూద్ నిజ జీవితంలో హీరోలా అందర్నీ ఆదుకోవటం చూసిన దేశం మొత్తం ఆయనని అభిమానించటం స్టార్ట్ చేసింది.

    Also Read: కరణ్ జోహార్ మెడకు డ్రగ్స్ కేసు… ఆ స్టార్స్ గుండెల్లో రైళ్లు!

    అలానే తెలంగాణా రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బ తండా పరిధిలోని చెలిమి తండాకు చెందిన రాజేష్‌ రాథోడ్‌కు సోనూసూద్‌ అంటే అభిమానం ఏర్పడింది. ఎంతలా అంటే ఏకంగా సోనూ సూద్‌కి విగ్రహం ఏర్పాటు చేసేంత, అది కూడా సొంత ఖర్చుతో. ఇదొక గొప్ప విషయమని తండా వాసులు రాజేష్ ని అభినందించారు. ఆదివారం స్థానికులు విగ్రహానికి పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు.రాజేష్‌ మాట్లాడుతూ.. ‘సోనూ సూద్‌ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలకు సాయం చేశారు. ఆయన సేవలను గుర్తించి ఐక్యరాజ్యసమితి ఎస్‌డీజీ ‘స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్‌’ అవార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మేం సోనూ సూద్‌కి విగ్రహం ఏర్పాటు చేసి మా అభిమానాన్ని చాటుకుంటున్నాం. దేవతల మాదిరిగానే ప్రతిరోజు సోనూ సూద్‌ విగ్రహానికి పూజలు చేస్తాం’ అని తెలిపారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్