https://oktelugu.com/

ప్రభాస్ రెడీగా ఉన్నాడు… డైరెక్టర్ కావాలి అంటున్న నిర్మాత

అనతి కాలంలో పెద్ద నిర్మాణ సంస్థగా ఎదిగింది మైత్రి మూవీ మేకర్స్. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ మైత్రి చేతిలోనే ఉన్నాయి. సుకుమార్, అల్లు అర్జున్ ల పుష్ప , మహేష్ సర్కారు వారి పాట వంటి భారీ చిత్రాలతో పాటు నాని నటిస్తున్న అంటే సుందరం అనే మూవీ కూడా మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. పరిశ్రమలో దిల్ రాజు తరువాత ఆ స్థాయిలో చిత్రాలు చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 21, 2020 / 04:09 PM IST
    Follow us on


    అనతి కాలంలో పెద్ద నిర్మాణ సంస్థగా ఎదిగింది మైత్రి మూవీ మేకర్స్. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ మైత్రి చేతిలోనే ఉన్నాయి. సుకుమార్, అల్లు అర్జున్ ల పుష్ప , మహేష్ సర్కారు వారి పాట వంటి భారీ చిత్రాలతో పాటు నాని నటిస్తున్న అంటే సుందరం అనే మూవీ కూడా మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. పరిశ్రమలో దిల్ రాజు తరువాత ఆ స్థాయిలో చిత్రాలు చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్.

    Also Read: పవన్ ని ఢీ కొట్టనున్న రానా… ఆ క్రేజీ రీమేక్ స్టార్ట్

    టాలీవుడ్ పైనే కాకుండా పాన్ ఇండియా చిత్రాలపై వీరు కన్నేశారు. ఎన్టీఆర్ మరియు కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో మూవీ చేయాలని వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు చాలా వరకు సఫలం అయినట్లు కనిపించాయి. అయితే అనూహ్యంగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో మూవీ ప్రకటించారు. ఐతే పట్టువీడవని మైత్రి మూవీ మేకర్స్ ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

    Also Read: క్రేజీ అప్డేట్: కెజిఎఫ్ 2 టీజర్ డేట్ వచ్చేసింది

    దర్శకుడు ఎవరైనా పర్లేదు… ప్రభాస్ తో మూవీ ఒకే చేసేశారట. తమ బ్యానర్ లో ఒక చిత్రం చేయాలని ప్రభాస్ ని మైత్రి మూవీ మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తుంది. రాధే శ్యామ్ తరువాత నాగ్ అశ్విన్, ఆదిపురుష్ మరియు ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న సలార్ చిత్రాలను ప్రభాస్ పూర్తి చేయాల్సి వుంది. ఈ చిత్రాల అనంతరం తమకు మూవీ చేయాలని ప్రభాస్ తో మైత్రి నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా కథను సిద్ధం చేసే పనిలో నిర్మాతలు పడ్డారని సమాచారం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్