Homeఎంటర్టైన్మెంట్Nayanthara: ‘గాడ్ ఫాదర్’ కోసం స్టార్లు రెడీ.. తాజాగా నయనతార ఫోటో వైరల్ !

Nayanthara: ‘గాడ్ ఫాదర్’ కోసం స్టార్లు రెడీ.. తాజాగా నయనతార ఫోటో వైరల్ !

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి ఏరి కోరి చేస్తోన్న సినిమా ‘గాడ్ ఫాదర్’. కాగా ఈ గాడ్ ఫాదర్ సినిమా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయింది. డైరెక్టర్ మోహన్‌రాజా ఈ విషయాన్ని వెల్లడించాడు. పైగా నయనతారతో డైరెక్టర్ దిగిన ఫొటోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Nayanthara, Mohan Raja
Nayanthara, Mohan Raja

అన్నట్టు ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురావడానికి మెగాస్టార్ తన పరపతిని వాడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ లో నటించడానికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను ఒప్పించారు. కేవలం చిరు కోసమే సల్మాన్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే చిరు మరో బాలీవుడ్ స్టార్ ను రంగంలోకి దించుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read:  సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ను కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు అట. అయితే, రూమర్స్ గా మొదలైన ఈ వార్తలో నిజంగానే వాస్తవం ఉంది అని తెలుస్తోంది. అలాగే తమ్ముడు పాత్రలో యంగ్ హీరో సత్యదేవ్‌ కనిపించబోతున్నాడు. మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Nayanatara
Nayanatara

ఇప్పటికే తమన్ ఈ సినిమా కోసం రెండు సాంగ్స్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మొత్తం నాలుగు సాంగ్స్, ఒక బిట్ సాంగ్ ఉండబోతున్నాయి. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన లూసిఫర్‌కు రీమేక్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Also Read:  అసెంబ్లీ సమావేశాలకు బద్దకమేనా ప్రజాప్రతినిధులూ?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular