OG Firestorm Song: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఓజీ'(They Call Him OG). హాలీవుడ్ స్టైల్ మేకింగ్ తో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా కి షూటింగ్ ప్రారంభమైన మొదటి రోజు నుండే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. కారణం పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ న్యూ ఏజ్ కంటెంట్ తో ఒక మంచి టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ తో పని చేయడం వల్లే. మొదటి నుండి ఈ సినిమా మీద పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండానే డైరెక్టర్ సుజిత్ వ్యవహరిస్తూ వచ్చాడు. ముందుగా 2023 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మొదటి గ్లింప్స్ వీడియో కి ఎంతటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. నేడు ఈ సినిమా గిరించి ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తుందంటే అందుకు కారణం ఆ గ్లింప్స్ అనే చెప్పాలి.
Also Read: రెమ్యూనరేషన్ విషయంలో యాంకర్ సుమ ని దాటేసిన సుడిగాలి సుధీర్!
ఇక రీసెంట్ గా విడుదల చేసిన మొదటి లిరికల్ వీడియో ‘ఫైర్ స్ట్రోమ్'(Fire Storm) కి అయితే సునామీ లాంటి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా ఈ పాట గురించే ఇప్పుడు చర్చ. ఇంత అద్భుతమైన కంపోజిషన్ థమన్ ఎలా ఇవ్వగలిగాడు?, అదేమీ క్వాలిటీ బాబోయ్ అంటూ చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన రెస్పాన్స్ ఈమధ్య కాలం లో ఏ లిరికల్ వీడియో సాంగ్ కి కూడా రాలేదు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి ఇలాంటి చార్ట్ బస్టర్ సాంగ్ పడి చాలా కాలమే అయ్యింది. రెండు చెవుల్లో ఇయర్ బడ్స్ పెట్టుకొని ఈ పాట వింటే వచ్చే కిక్ వేరు. అదే విధంగా థియేటర్ లో అద్భుతమైన అనుభూతి కలిగిందట. ఈ పాటని ప్రసాద్ మల్టీప్లెక్స్ లోని బిగ్ స్క్రీన్ PCX లో ప్రతీ రోజు ఇంటర్వెల్ సమయం లో ప్లే చేస్తున్నారట.
థియేటర్ లో ఉన్న సౌండింగ్ సిస్టం కి థమన్ అందించిన బీట్స్ కి ఎక్కడ DTS బాక్స్ లు కాలిపోతాయో అని ఆ థియేటర్ ఆపరేటర్ భయపడిపోతున్నాడట. అంతే కాదు, ఆడియన్స్ నుండి సౌండ్ తగ్గించమని రిక్వెస్ట్ లు కూడా వస్తున్నాయట. ఇక తన ఫోన్ లో అదే పాటని పదే పదే పెట్టి వింటుండడం తో తన ఫోన్ నుండి వాల్యూం తగ్గించాల్సిందిగా మెసేజ్ వచ్చిందని ఆయన ఒక స్క్రీన్ షాట్ ని షేర్ చేయగా అది సోషల్ మీడియా లో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడే ఇలా ఉంటే, థియేటర్ లో సినిమా రిలీజ్ అప్పుడు ఎలా ఉండుంటుందో ఊహించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి పని చేసే సంగీత దర్శకుడు థమన్, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సన్నివేశాలకు ఏ రేంజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఉంటాడో అని ఇప్పటి నుండే అంచనాలు వేసుకుంటున్నారు ఫ్యాన్స్.
#Firestorm effect @MusicThaman #OG #TheyCallHimOG #TheyCallHimOGFirstSingle pic.twitter.com/UTHUB6TdGc
— Mohan Kumar (@ursmohan_kumar) August 5, 2025