https://oktelugu.com/

Viswak Sen: విశ్వ‌క్‌ సేన్‌ కు వాళ్ళ స‌పోర్ట్‌… ర‌చ్చ మళ్లీ మొదలైంది !

Viswak Sen: విశ్వక్ సేన్ తన ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ సినిమా ప్రమోషన్స్‌ కోసం చేసిన ప్రాంక్‌ వీడియో మిస్ ఫైర్ అయ్యింది. ఈ వీడియో పై ఓ ప్రముఖ ఛానెల్ లో చర్చ జరిగింది. ఆ చర్చలో ఆవేశాలు పెరిగి, విశ్వక్ సేన్ ను సదరు యాంకర్ ‘దేవి నాగవల్లి’ ‘గెట్ అవుట్’ అంటూ గట్టిగా అరిచి చెప్పింది. ఈ వ్యవహారంలో దేవి నాగవల్లికి మహిళల సంఘాలు, జర్నలిస్ట్‌ సంఘాలు మద్దతుగా నిలబడ్డాయి. కానీ.. ఇటు […]

Written By:
  • Shiva
  • , Updated On : May 6, 2022 / 10:17 AM IST
    Follow us on

    Viswak Sen: విశ్వక్ సేన్ తన ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ సినిమా ప్రమోషన్స్‌ కోసం చేసిన ప్రాంక్‌ వీడియో మిస్ ఫైర్ అయ్యింది. ఈ వీడియో పై ఓ ప్రముఖ ఛానెల్ లో చర్చ జరిగింది. ఆ చర్చలో ఆవేశాలు పెరిగి, విశ్వక్ సేన్ ను సదరు యాంకర్ ‘దేవి నాగవల్లి’ ‘గెట్ అవుట్’ అంటూ గట్టిగా అరిచి చెప్పింది. ఈ వ్యవహారంలో దేవి నాగవల్లికి మహిళల సంఘాలు, జర్నలిస్ట్‌ సంఘాలు మద్దతుగా నిలబడ్డాయి.

    Viswak Sen

    కానీ.. ఇటు విశ్వక్‌ కు మాత్రం ఎవ్వరూ మద్దతు ప్రకటించలేదు. సినిమా వాళ్ళు కూడా సినిమా వాడికి సపోర్ట్ చేయలేదు. సినిమా పరిశ్రమ నుంచి విశ్వక్‌ కు ఎవ్వరి మద్దతు లభించలేదు. సినిమా పెద్దలు ఒక్కరంటే ఒక్కరు కూడా మద్దతు ఇవ్వడానికి ఆసక్తి చూపించకపోవడంతో ఈ విషయంలో అతను ఒంటరిగా మిగిలిపోయాడు. కనీసం ఈ ఇష్యూ ని ఇక్కడితో ఆపడానికి కూడా సినిమా పెద్దలలో ఒక్కరు కూడా ప్రయత్నించలేదు.

    Also Read: NTR- Sai Pallavi: ఎన్టీఆర్‌ తో సాయిప‌ల్ల‌వి ఫిక్స్.. ఆ హీరోయిన్ కూడా !

    ఐతే, సినీ పెద్దలు విశ్వక్ సేన్ కి సపోర్ట్ చేయకపోయినా.. స్టార్ హీరోల అభిమానులు మాత్రం విశ్వక్‌ సేన్ కు బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి తాను వీరాభిమానిని అని విశ్వక్‌ సేన్ గతంలో చాలా సందర్భాల్లో చెప్పాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు అందరూ బహిరంగంగానే విశ్వ‌క్‌ కు మద్దతు ఇస్తూ.. అతను మా వాడు అంటూ దేవి నాగవల్లి పై విరుచుకుపడుతున్నారు.

    Viswak Sen

    అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమా హిట్ చేయాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు విశ్వకు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా మామూలుగా లేదు. అలాగే హీరో నాని అభిమానులు సైతం విశ్వ‌క్‌కు సపోర్టు చేస్తున్నారు. వీరితో పాటు ఇండస్ట్రీలోని కొందరు నెటిజన్లు సైతం విశ్వక్ సేన్ కి మద్దతుగా నిలుస్తున్నారు.

    కాకపోతే, సినిమా పెద్దలు ఒక్కరంటే ఒక్కరు కూడా మద్దతు ఇవ్వడానికి ఆసక్తి చూపించకపోవడంతో ఈ విషయంలో విశ్వక్ సేన్ ఒంటరిగా మిగిలిపోయాడు. కనీసం ఈ ఇష్యూ ని ఇక్కడితో ఆపడానికి కూడా సినిమా పెద్దలు ఎందుకు ప్రయత్నించలేదు.

    Also Read:Duggirala MPP Election: దుగ్గిరాలలో వైసీపీ మార్కు రాజకీయం.. ఐదుగురు సభ్యుల మద్దతుతో ఎంపీపీ పీఠం కైవసం

    Tags