https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసి ప్లాప్ లను అందుకున్న స్టార్ హీరోయిన్స్…

బాలు సినిమాలో శ్రేయ హీరోయిన్ గా నటించింది. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికి వరుసగా మంచి విజయాలను అందించిన శ్రేయ.. పవన్ కళ్యాణ్ తో చేసిన బాలు సినిమాతో మాత్రం భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది.

Written By:
  • Gopi
  • , Updated On : March 17, 2024 / 04:15 PM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan: చిరంజీవి తమ్ముడు గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లోనే వరుస సక్సెస్ లను అందుకొని స్టార్ హీరోగా తనను తాను రిప్రజెంట్ చేసుకున్నాడు. ఇక అలాగే ఇండస్ట్రీలో చిరంజీవికి తగ్గ తమ్ముడి గా కూడా మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు. ఇక ఆయన చేసిన మొదటి సినిమా అంత పెద్దగా ఆడకపోయిన కూడా ఆ తర్వాత నుంచి వరుసగా సక్సెస్ లను అందుకుంటూ స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా పవర్ స్టార్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే వేరే హీరోలతో భారీ హిట్స్ ను అందుకున్న కొంత మంది హీరోయిన్లు పవన్ కళ్యాణ్ తో చేసిన సినిమాలతో మాత్రం ప్లాప్ లను అందుకోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    శ్రేయ
    బాలు సినిమాలో శ్రేయ హీరోయిన్ గా నటించింది. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికి వరుసగా మంచి విజయాలను అందించిన శ్రేయ.. పవన్ కళ్యాణ్ తో చేసిన బాలు సినిమాతో మాత్రం భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది.

    త్రిష
    ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికీ తన సినిమాలతో వరుస విజయాలను అందించిన త్రిష పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం తడబడింది. తీన్ మార్ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన నటించింది. వీళ్ళ జంట చూడ్డానికి చాలా బాగున్నప్పటికీ సినిమా మాత్రం కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వలేదు…

    కాజల్ అగర్వాల్
    అప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికీ సూపర్ డూపర్ సక్సెస్ లను అందిస్తూ వచ్చిన కాజల్ పవన్ కళ్యాణ్ తో చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమాతో తను భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది…

    పవన్ కళ్యాణ్ స్టార్ హీరోయిన్లందరికీ వరుసగా భారీ డిజాస్టర్ ని అందించాడనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం చాలా ఇంట్రెస్ట్ అని చెప్పిన హీరోయిన్లందరూ ఆయనతో చేసిన సినిమాలతో డిజాస్టర్లని మూటగట్టుకోవడం అనేది ఒక వంతుకు చాలా బాడ్ న్యూస్ అనే చెప్పాలి…