Tollywood: ఈ చిన్నది కూడా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం హీరోయిన్ గా మారిన ఈమె స్టార్ హీరోలకు జోడిగా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు ఈ బ్యూటీ తమిళ్, హిందీ భాషలలో కూడా నటిస్తూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది ఈ బ్యూటీ. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర కథానాయకలలో ఈమె కూడా ఒకరు. ఈ మధ్యనే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశం అందుకున్న ఈ బ్యూటీ అక్కడ మాత్రం వరుస డిజాస్టర్స్ అందుకుంటుంది. ఈ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు అందాల కీర్తి సురేష్. కీర్తి సురేష్ ప్రముఖ నిర్మాత సురేష్ కుమార్, నటి మేనక దంపతుల గారాల పట్టి.
కీర్తి సురేష్ 2000 సంవత్సరంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాలలో నటించి మూడు సంవత్సరాలు ప్రేక్షకులను అలరించింది. కీర్తి సురేష్ ఫ్యాషన్ డిజైనర్ లో డిగ్రీ పూర్తి చేసింది. ఇక కీర్తి సురేష్ గీతాంజలి అనే మలయాళం సినిమాతో హీరోయిన్గా మారింది. మొదటి సినిమాలో తన అందంతో, నటనతో అందరి నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక తర్వాత హీరో రామ్ పోతినేనీ కు జోడిగా నేను శైలజ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తెలుగులో కూడా తన అందం, అభినయంతో తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. నేను శైలజ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతోపాటు నటిగా కీర్తి సురేష్ కు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత కీర్తి సురేష్ మహానటి సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మహానటి సినిమాతో కీర్తి సురేష్ విమర్శకుల నుంచి కూడా తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమాకు ఏకంగా ఆమె జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఆ తర్వాత కీర్తి సురేష్ కు తెలుగుతోపాటు, తమిళ్, మలయాళం లో కూడా వరుస అవకాశాలు అందుకుంది. ఈ మధ్యకాలంలో బేబీ జాన్ అనే సినిమాతో కీర్తి సురేష్ హిందీలో కూడా హీరోయిన్ గా చేసే అవకాశం అందుకుంది. కానీ బేబీ జాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పొందింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటిన కీర్తి సురేష్ హిందీలో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది.