Nandamuri Janakiram Son: నందమూరి కుటుంబం నుండి మరో కొత్త హీరో ఇండస్ట్రీ లోకి రాబోతున్నాడు. స్వర్గీయ నందమూరి హరికృష్ణ(Nandamuri Harikrishna) పెద్ద కుమారుడు స్వర్గీయ జానకి రామ్(Nandamuri Janakiram) కి తారక రామారావు(NTR) అనే కొడుకు ఉన్నాడు. ఈయన హీరో గా లాంచ్ అవుతూ నేడు పూజా కార్యక్రమాలు జరిగాయి. ఎంతో మంది టాలెంటెడ్ హీరోలను, హీరోయిన్లను ఇండస్ట్రీ కి పరిచయం చేసి బ్లాక్ బస్టర్స్ ని అందుకున్న వై వీ ఎస్ చౌదరి(YVS Chowdary) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఒకప్పుడు అపజయం అనేదే ఎరుగని డైరెక్టర్స్ లో ఒకరు ఈయన. ‘ఒక్కమగాడు’ చిత్రం నుండి ఈయన వరుస ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ వస్తున్నాడు. అయితే నేటి తరం ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ ఇతనితో భారీ చిత్రాన్ని ప్లాన్ చేసి కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. మరి ఎంతమేరకు సక్సెస్ అవ్వగలడో చూడాలి.
Also Read: పనిచేయని బీసీసీఐ బుజ్జగింపులు.. టెస్టులపై విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం
ఈ చిత్రాన్ని వై వీ ఎస్ చౌదరి సతీమణి గీత నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రం ద్వారా వీణారావు అనే తెలుగమ్మాయి ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గారి సతీమణి నారా భువనేశ్వరి ముహూర్తం షాట్ కి క్లాప్ కొత్తగా, ఎంపీ పురందేశ్వరి కెమెరా స్విచ్ ఆన్ చేసింది. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘చిన్న వయస్సులోనే కన్నతండ్రిని కోల్పోయిన బాధ నుండి బయటపడి, ఈరోజు తన కెరీర్ లో అతి ముఖ్యమైన అంకాన్ని మొదలు పెట్టినందుకు ఎన్టీఆర్ ని చూసి గర్విస్తున్నాను. నా మనవడు మొదటి సినిమాకు సంబంధించిన లాంచ్ కార్యక్రమంలో పాల్గొని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వచ్చాను. సినీ ఇండస్ట్రీ లో నందమూరి వంశ చరిత్ర చిరస్మరణీయం. ఆ వంశ ప్రతిష్టను ఎన్టీఆర్ మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తన తాత పేరు పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు ప్రఖ్యాతలు ఎలా పెంచాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ అనే పేరు చెప్తే తెలుగు రాష్ట్రాల్లో నేటి తరం ఆడియన్స్ కూడా పూనకాలు వచ్చి ఊగిపోయే రేంజ్ లో చేసాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ స్థాయిలో ఈ ఎన్టీఆర్ కూడా ఎదుగుతాడో లేదో చూడాలి. లుక్స్ చాలా బాగున్నాయి, హీరో గా కచ్చితంగా సెట్ అవుతాడు, నటన, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నిట్లోనూ సత్తా చాటితే అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే బాలయ్య కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తేజ కంటే ఈయనే ముందు లాంచ్ అవ్వడం. ఇది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు వై వీ ఎస్ చౌదరీ లాంచ్ చేసిన ప్రతీ హీరో సక్సెస్ అయ్యాడు. ఎన్టీఆర్ కి కూడా ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందో లేదో చూడాలి.
NTR’s debut film launched today#NTR #YVSChowdary pic.twitter.com/skFZwbKajq
— Telugu360 (@Telugu360) May 12, 2025