Star Heroine: తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం ప్రజాసేవలో బిజీగా గడుపుతుంది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన కొంతమంది హీరోయిన్లు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. వాళ్లలో చాలామంది పెళ్లి చేసుకుని తమ పూర్తి సమయాన్ని భర్తతో, పిల్లలతో గడుపుతున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కనిపిస్తున్నారు. ఒకప్పటి ముద్దుగుమ్మలు కొంతమంది రకరకాల వ్యాపారాలలో కూడా తమ సత్తా చాటుతున్నారు. అలాగే గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్లు కొంతమంది రాజకీయాలలో కూడా రాణిస్తున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా మారి ప్రజాసేవలో తమ పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. పైన ఉన్న ఫోటోలో కనిపిస్తున్న ఒకటి టాలీవుడ్ హీరోయిన్ కూడా ప్రస్తుతం ప్రజాసేవలో బిజీగా ఉంది. కోల్కత్తా కు చెందిన ఈ హీరోయిన్ తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, ఒడియా, హిందీ భాషలలో అనేక సినిమాలలో నటించి నటిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
Also Read: తెరుచుకున్న అట్టారీ–వాఘా సరిహద్దు.. పాకిస్థాన్ పౌరులకు ఉపశమనం
తెలుగులో ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, జగపతిబాబు, శ్రీకాంత్ ఇలా దాదాపు అందరూ హీరోలకు జోడిగా నటించి తెలుగులో బాగా క్రేజ్ తెచ్చుకుంది. ఒకవైపు ఈ బ్యూటీ సినిమాలు చేస్తూనే మరోవైపు యాంకర్ గా కూడా తన సత్తా చూపించింది. అదే సమయంలో రాజకీయాలలో కూడా ఎంట్రీ ఇచ్చింది. తొలి ప్రయత్నం లోనే రాజకీయాలలో విజయం అందుకుంది. ఈ హీరోయిన్ గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేసి ఏకంగా 76,853 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి పై గెలుపు సాధించింది. తొలిసారిగా పార్లమెంట్లో ఎంపీ సభ్యురాలిగా అడుగు పెట్టింది.
ప్రస్తుతం ప్రజాసేవలో తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ మరెవరో కాదు రచన బెనర్జీ. అయితే ఈమె పేరు చెబితే ప్రేక్షకులు అంతగా గుర్తుపట్టలేక పోవచ్చు కానీ చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా సినిమాలో హీరోయిన్ రంభ అక్కగా నటించిన హీరోయిన్ అంటే ప్రేక్షకులు ఈజీగా గుర్తుపడతారు. రచన బెనర్జీ తెలుగులో కన్యాదానం, అభిషేకం, సుల్తాన్, రాయుడు, పవిత్ర ప్రేమ, మావిడాకులు, లాహిరి లాహిరి లాహిరిలో వంటి పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. కెరియర్ బాగా ఫామ్ లో ఉన్న సమయంలోనే ప్రోబల్ బసు ను 2007లో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు. రచన బెనర్జీకి బెంగాలీలో బాగా పాపులారిటీ ఉంది.
View this post on Instagram