Pramod Mittal: కానీ సరిగ్గా 2013లోనే ఈ స్థాయిలో తన కూతురి వివాహం చేసి సరికొత్త రికార్డు చేశారు అపర కుబేరుడైన లక్ష్మీ మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్. నాటి రోజుల్లోనే అతడు 550 కోట్ల ఖర్చుతో తన కూతురి వివాహం జరిపించాడు. వచ్చిన అతిథుల కోసం ప్రత్యేకమైన విమానాలను ఏర్పాటు చేశాడు. పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా జరిపించాడు. దేశ విదేశాల నుంచి ప్రముఖమైన వ్యక్తులను తన కూతురి వివాహం కోసం పిలిపించాడు. వారికోసం ఆశ్చర్యం కూడా చిన్నబోయే విధంగా ఏర్పాట్లు చేశాడు. నాడు మీడియాలో ప్రమోద్ మిట్టల్ కుమార్తె వివాహానికి సంబంధించి లైవ్ వీడియో టెలికాస్ట్ అయింది. నేషనల్, లోకల్ మీడియా అని తేడా లేకుండా.. అన్ని చానల్స్ ఈ వేడుకను కవర్ చేశాయి. అయితే ఈ వివాహం జరిగిన తర్వాత ప్రమోద్ వ్యాపారముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. 550 కోట్ల ఖర్చుతో తన కుమార్తె వివాహం జరిపించిన ప్రమోద్.. దివాలా తీశారు. బికారిగా మారిపోయారు. చివరికి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
ఏం జరిగిందంటే
ప్రమోద్ జి ఐ కే ఐ ఎల్ అనే కంపెనీకి ప్రమోటర్గా ఉన్నారు. ఆ కంపెనీ 116 మిలియన్ డాలర్ల రుణాన్ని బ్యాంకులకు చెల్లించకపోవడంతో.. ఆయన కంపెనీల పతనం మొదలైంది. ఇక ఒక మోసం కేసులో బోస్నియా దేశంలో ప్రమోద్ అరెస్టు అయ్యారు. దీంతో అతని వ్యాపారాలు నష్టాల పాలయ్యాయి. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకపోవడంతో కంపెనీలు మూతపడ్డాయి. విలాసవంతమైన జీవితం.. అద్భుతమైన ప్యాలెస్ లలో నివసించిన అతని కుటుంబం రోడ్డు మీద పడింది. వేలాది మంది ఉద్యోగులు ఉన్న అతని కంపెనీలు దివాలా తీసాయి. కొన్ని కంపెనీలను అయితే బ్యాంకులు వేలం వేశాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రమోద్ సినిమాల్లో చూపించినట్టుగా డౌన్ ఫాల్ అయ్యారు. ఒకప్పుడు లక్షల కోట్లు కళ్ళు చూసిన అతను.. ఇప్పుడు రూపాయి రూపాయికి ఇబ్బంది పడుతున్నారు. భార్య, పిల్లలను పోషించడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. నెలవారి ఖర్చులకోసం దేహి అని దేబిరిస్తున్నారు. అందువల్లే ఆగర్భ శ్రీమంతులు.. డబ్బులు ఉన్నాయని మిడిసి పడకూడదు.. వేలాది కోట్లు ఉన్నాయని ఎగిరి పడకూడదు. అలా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇలాంటి దారుణాలే చోటుచేసుకుంటాయి. అందువల్లే స్వీయ ఆర్థిక క్రమశిక్షణ కచ్చితంగా పాటించాలి. వచ్చే రూపాయికి.. పెట్టే ఖర్చుకు లంకే ఉండాలి. లేకపోతే ఎంత పెద్ద శ్రీమంతులైనా చివరికి బికారీలుగా మారాల్సి ఉంటుంది. ప్రమోద్ ఉదాహరణ శ్రీమంతులు నేర్చుకోవాల్సిన ఆర్థిక గుణపాఠం…