Star Heroine: ఒకప్పుడు ఇటువంటి రూమర్స్ ఎక్కువగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉండేవి. సౌత్ లో ఇటువంటి రూమర్స్ చాలా తక్కువ. అప్పట్లో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడో ఒకసారి ఇటువంటి వార్తలు వినిపించేవి. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ గురించి కూడా ఇటువంటి రూమర్స్ కొన్ని చాలానే వినిపించాయి. ఈ బ్యూటీ తెలుగులో దాదాపు స్టార్ హీరో లందరితో జోడిగా నటించింది. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ గా రాణించింది. అప్పట్లో ఈ హీరోయిన్ ఏకంగా నలుగురు హీరోలతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు వార్తలు బాగా వినిపించాయి. కానీ ప్రస్తుతం ఈ హీరోయిన్ 42 ఏళ్ళ వయసు వచ్చినా కూడా ఇంకా సింగిల్గానే ఉంటుంది. ఈ హీరోయిన్ మరెవరో కాదు త్రిష. త్రిష అందానికి అందరూ ఫిదా అవ్వాల్సిందే. 42 ఏళ్ల వయసులో కూడా త్రిష చాలా అందంగా కనిపిస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఆమె వయసుకు ఆమె గ్లామర్ కు అస్సలు సంబంధం లేదు అని చెప్పొచ్చు.
Also Read: పాకిస్థాన్‌పై దాడికి భారత్ వ్యూహం.. కీలక స్థావరం గుర్తింపు!
ప్రస్తుతం 42 వేల వయసులో కూడా త్రిష ఎంతో అందంగా 22 ఏళ్ల అమ్మాయిలాగా కనిపిస్తుంది. త్రిష హీరోయిన్ గా నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఈ సినిమాలో తరుణ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత త్రిష హీరో ప్రభాస్ కు జోడిగా వర్షం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వర్షం సినిమాతో త్రిష క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. వర్షం సినిమా త్రిష స్టార్ హీరోయిన్గా నిలబెట్టింది. ఆ తర్వాత మళ్లీ ఈ చెన్నై బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత త్రిష తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు వంటి వరుస హిట్ సినిమాలలో నటించింది.

దశాబ్దం పాటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో త్రిష హవా కొనసాగింది. ఈమె రిలేషన్ షిప్ గురించి కూడా అనేక వార్తలు వినిపించాయి. గతంలో హీరో శింబుతో త్రిష ప్రేమాయణం గురించి అనేక వార్తలు సౌత్ సినిమా ఇండస్ట్రీలో వినిపించాయి. ఇక ఆ తర్వాత త్రిష సిద్ధార్థ తో ప్రేమలో పడిందని అలాగే హీరో రానా తో కూడా త్రిష కొంతకాలం డేటింగ్ చేసిందని వార్తలు కూడా వినిపించాయి. ఇక చివరికి త్రిష ప్రస్తుతం దళపతి విజయ్తో కూడా ప్రేమలో ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలలో నిజమెంత ఉందో తెలియదు కానీ ఈ నలుగురు హీరోలతో త్రిష ప్రేమాయణం నడిపిందని మాత్రం సామాజిక మాధ్యమాలలో వార్తలు వినిపించాయి.