Pawan Kalyan: సోషల్ మీడియా ఇంత వృద్ధిలోకి వచ్చిన తర్వాత, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగిన తర్వాత కూడా బాలీవుడ్ లో కొంతమంది హీరో, హీరోయిన్లకు మన టాలీవుడ్ స్టార్స్ పేర్లు తెలియవా..?, లేదా తెలిసినప్పటికీ కూడా తెలియనట్టు నటిస్తున్నారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న గా మిగిలింది. రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్ర పోషించిన ‘జిగ్ర’ అనే చిత్రం విడుదలైన. నెగటివ్ రివ్యూస్ ని దక్కించుకున్న ఈ సినిమాకి థియేట్రికల్ రన్ కూడా బాలేదు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు అలియా భట్ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రిలీజ్ కోసం ప్రొమోషన్స్ చురుగ్గా చేసింది. అందులో భాగంగా ఆమె పలు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చింది. ఒక ఇంటర్వ్యూ లో మెగా ఫ్యామిలీ ఫోటో ని చూపిస్తూ అలియా భట్ ని ఒక ప్రశ్న అడుగుతుంది. ఈ ఫొటోలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, అంజనాదేవి మరియు చిరంజీవి ఇద్దరు సోదరీమణులు ఉంటారు.
ఈ ఫోటోని యాంకర్ సుమ చూపిస్తూ ‘ఈ ఫోటో లో ముగ్గురు స్టార్స్ ఉన్నారు ఎవరో కనిపెట్టండి..వీళ్ళు రీసెంట్ గా మీరు నటించిన ఒక స్టార్ హీరోకి సంబంధించిన కుటుంబానికి చెందిన వాళ్ళు’ అని అంటుంది. అయితే పవన్ కళ్యాణ్, చిరంజీవి,నాగబాబు ముఖాలను స్టార్స్ గుర్తుతో కనిపించకుండా చేసి ఈ ప్రశ్న అడుగుతుంది. ఆ చిత్ర దర్శకుడు అలియా భట్ కి క్లూ ఇస్తూ ‘కాసేపటి క్రితమే మీరు ఆ కో స్టార్ తో ఫోన్ లో మాట్లాడారు’ అని చెప్పగా, అలియా భట్ చరణ్ అని గుర్తు పడుతుంది. ఆ తర్వాత అప్పటి వరకు ఉన్న స్టార్స్ గుర్తు ని తీసేయగా, చిరంజీవి సార్ తెలుసు, మిగతా ఇద్దరు ఎవరు అని అలియా భట్ అడగగా, పవన్ కళ్యాణ్, నాగబాబు అని చెప్తాడు ఆ చిత్ర దర్శకుడు.
ఇది చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎవరో తెలియని బాలీవుడ్ నటీనటులు కూడా ఉన్నారా అని నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు. అలియా భట్ భర్త రణబీర్ కపూర్ కూడా బాలీవుడ్ లో పెద్ద సూపర్ స్టార్. ఆయన ఆంధ్ర ప్రదేశ్ కి బ్రహ్మాస్త్ర మూవీ ప్రొమోషన్స్ కోసం వచ్చినప్పుడు నాకు పవన్ కళ్యాణ్ సార్ స్టైల్, మ్యానరిజమ్స్ అంటే ఇష్టమని చెప్తాడు. అలాగే అమీర్ ఖాన్ కూడా ‘దంగల్’ చిత్రం ప్రొమోషన్స్ కి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ తన ఫేవరెట్ హీరో అని ఒక ప్రెస్ మీట్ లో చెప్తాడు. కరీనా కపూర్, సాయి మంజ్రేకర్, అభిషేక్ బచ్చన్ ఇలా ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ పవన్ కళ్యాణ్ తమ అభిమాన హీరో అని ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. ఇంత మంది బాలీవుడ్ స్టార్స్ కి తెలిసిన పవన్ కళ్యాణ్ అలియా భట్ కి తెలియదా అని సోషల్ మీడియా లో అభిమానులు మండిపడుతున్నారు. ఆమె మాట్లాడిన ఆ వీడియో ని మీరే చూడండి.