Star Heroine Becomes Monk: ఎవరి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పలేం. కలర్ఫుల్ లగ్జరీ లైఫ్ వదిలేసి సన్యాసినిగా మారింది ఓ హీరోయిన్. ఆమె నిర్ణయం చిత్రవర్గాలను విస్మయానికి గురి చేసింది. ఇంతకీ ఆమె సన్యాసిని ఎందుకు అయ్యారో చూద్దాం..
సినిమా అనే రంగుల ప్రపంచంలో వెలిగిపోవాలని అనేక మంది కలలు కంటారు. కానీ అది కొందరికే సాధ్యం. ఎంత ప్రయత్నం చేసినా కొందరికి కనీసం సిల్వర్ స్క్రీన్ పై కనిపించే అవకాశం రాకపోవచ్చు. ఇక హీరోయిన్ ఛాన్స్ అంటే, అదో అద్భుతం. టాలెంట్ కి లక్ కూడా జత అయితే స్టార్ కావచ్చు. లగ్జరీ లైఫ్, ఫేమ్, నేమ్, ఫ్యాన్స్.. ఇలా అందమైన జీవితం సొంతం చేసుకోవచ్చు. అందుకే పలువురు చిత్ర పరిశ్రమ పట్ల ఆకర్షితులు అవుతారు. అయితే ఓ హీరోయిన్ సక్సెస్ దక్కాక కూడా పరిశ్రమను వదిలేసి సన్యాసిగా మారింది. పూర్తిగా విరుద్ధమైన నిర్ణయం తీసుకుంది. ఆమె ఎవరో కాదు బర్క మదన్.
పంజాబ్ కి చెందిన బర్క మదన్(BARKHA MADAN) మోడలింగ్ ని కెరీర్ గా ఎంచుకుంది. అనంతరం 1994లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. అదే ఏడాది సుస్మితా సేన్, ఐశ్వర్య రాయ్ పాల్గొనడం విశేషం. 1996లో విడుదలైన హిందీ చిత్రం ఖిలాడీయోన్కి ఖిలాడీ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ మూవీతో బర్క మదన్ కీలక రోల్ చేసింది. ఆఫర్స్ వస్తున్నప్పటికీ బర్క మదన్ సెలెక్టివ్ గా సినిమాలు చేసేది. 2003లో విడుదలైన బూత్ చిత్రం బర్క మదన్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అనొచ్చు. ఈ చిత్రంలో ఆమె దెయ్యంగా నటించి మెప్పించింది.
Also Read: Top Heroine: ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్..ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..ఎవరంటే…
బూత్ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు. నిర్మాతగా కూడా బర్క రాణించారు. అలాగే సీరియల్స్ లో నటించారు. ఆమె చేసింది కొద్ది చిత్రాలే అయినా ఫేమ్ రాబట్టింది. స్క్రిప్ట్స్ విషయంలో బర్క మదన్ చాలా పర్టిక్యులర్ గా ఉండేది. 2012 వరకు ఆమె పరిశ్రమలో ఉన్నారు. అనూహ్యంగా ఆధ్యాత్మికం వైపు ఆమె మనసు మరలింది.
2012లో బర్క మదన్ బుద్ధిజం తీసుకున్నారు. బౌద్ధ సన్యాసిని(BUDDHIST NUN)గా ఆమె మారిపోయారు. దలైలామాను ఆమె ఆరాధిస్తారు. ఆయన సిద్ధాంతాలు ఫాలో అవుతారు. బౌద్ధ ధర్మం, మత సిద్ధాంతాలు బర్కను ఎంతగానో ఆకర్షించాయి. అందుకే బౌద్ధ సన్యాసిగా ఆమె మారిపోయారు. సినిమా పరిశ్రమ అంటే షూటింగ్స్, మీటింగ్స్, పార్టీలు, విందులు, వినోదాలతో విలాసవంతంగా ఉంటుంది. అందుకు పూర్తి విరుద్ధమైన సాధారణ జీవితం బౌద్ధ సన్యాసినిగా ఆమె గడపాల్సి ఉంటుంది. బర్క మదన్ వంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు.