Top Heroine: తెలుగుతోపాటు తమిళ్లో కూడా వరుస సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది.తెలుగులో దాదాపు అగ్ర హీరోలందరికి జోడీ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈమె వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కూడా. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని స్టార్ట్డం తెచ్చుకుంది. తన అందం, అమాయకత్వం అలాగే అద్భుతమైన తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పట్లో ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్ళ కలల రాణి. తెలుగులో అగ్ర హీరోలకు జోడిగా నటించి ఓ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. కొన్ని ఏళ్లపాటు ఈ చిన్నది సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. నాలుగు పదుల వయసులో కూడా పెళ్లికి దూరంగా ఉంటూ ఒంటరిగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా కూడా మారింది. అడవులలో ఉన్న జంతువుల ఫోటోలను అందంగా తీస్తూ తనకు ఎంతో ఇష్టమైన రంగంలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం వైల్డ్ లైఫ్ ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ సదా. హీరోయిన్ సదా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం ఉండదు. తెలుగులో ఈమె ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, బాలకృష్ణ, నితిన్ వంటి హీరోలకు జోడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2003లో రిలీజ్ అయిన జయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయింది సదా. తొలి సినిమాతోనే ఈ అమ్మడు భారీ విజయం అందుకుంది. ఈ సినిమాలో తన అమాయకత్వంతో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. జయం సినిమా హిట్ అయిన తర్వాత ఈమెకు తెలుగు తో పాటు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలు వచ్చాయి.
ముఖ్యంగా ఈ చిన్నది జయం సినిమాతో యూత్ ను ఆకట్టుకుంది. విక్రమ్ చియాన్ నటించిన అపరిచితుడు సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఆమె నటించిన కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అందుకున్నాయి. దీంతో సదాకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత బుల్లితెరపై రియాల్టీ షోలలో కూడా జడ్జిగా వ్యవహరించింది సదా. తనకు ఎంతో ఇష్టమైన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ రంగంలో అడుగు పెట్టింది. అడవులలో సింహాలు, పులులు, పక్షులు వంటి వాటిని మరింత అందంగా ఫోటోలు తీస్తూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది సదా.
View this post on Instagram