Venky Atluri: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే సినిమాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటాయి. చాలా మంది దర్శకులు స్టార్ హీరోలతోనే సినిమాలు చేయాలనుకుంటారు. ఎందుకంటే ఆ సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయి అలాగే వాళ్ళు చెప్పిన పాయింట్ చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుందనే వాళ్లు సినిమాలను చూస్తుంటారు. ఇక ఇలాంటి సందర్భంలో వెంకీ అట్లూరి చేసిన సినిమాలు అతనికి మంచి క్రేజ్ ను తీసుకువచ్చి పెట్టాయి. కెరియర్ మొదట్లో తొలిప్రేమ సినిమాతో సక్సెస్ ని అందుకున్న ఆయన ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాతో పాపాలను మూటగట్టుకున్నారు.
ఆ టైంలో ఆయనకి అవకాశాలివ్వడానికి ఏ సాహసం చేయలేదు. ఇక అప్పుడు రవితేజ కి కూడా సార్ సినిమా కథ చెప్పాడట. కానీ అప్పటికే ఆయన కమిట్ సినిమాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆయన ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాడు…దాంతో ఆయన తమిళ్ హీరో అయిన ధనుష్ ను పెట్టి సార్ మూవీ చేశాడు. ఈ సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంది.
ఈ మూవీ తర్వాత వెంకీ అట్లూరి దుల్కర్ సల్మాన్ లతో లక్కీ భాస్కర్ అనే సినిమా చేశాడు. ఈ కథను కూడా నాగచైతన్య నానిలకు చెప్పారట. వాళ్ళిద్దరూ కూడా ఈ సినిమా చేయకపోవడంతో విసిగిపోయిన ఆయన మలయాళం ఇండస్ట్రీలో ఉన్న దుల్కర్ సల్మాన్ ను తీసుకొచ్చి లక్కీ భాస్కర్ సినిమా చేసి సూపర్ సక్సెస్ ను సాధించాడు. ఇక మొత్తానికైతే ఆయన మీద పెద్దగా నమ్మకం ఉంచలేదు.
కానీ వెంకీ అట్లూరిలో టాలెంట్ ఎంత ఉంది అనేది సినిమా ద్వారా ప్రూవ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సూర్యతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు… ఒక వేళ ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తే మాత్రం ఆయన స్టార్ డైరెక్టర్ గా మారిపోతాడు. ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు డిఫరెంట్ గా ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు రాబోతున్న సినిమాలు కూడా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తాయి అనే కాన్ఫిడెంట్ తో డైరెక్టర్ ఉన్నాడు…