Prashanth Neel NTR Differences: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సౌత్ సినిమా దర్శకులకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి స్టార్ట్ డైరెక్టర్లందరు టాప్ పొజిషన్లో ముందుకు దూసుకెళ్తుంటే కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి కేజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ప్రశాంత్ నీల్ తన ప్రతిభ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రభాస్ తో చేసిన ‘సలార్’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఈ సినిమాలు సక్సెస్ అయిన తర్వాత ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద అటు ప్రశాంత్ నీల్ అభిమానుల్లో ఇటు ఎన్టీఆర్ డే హార్ట్ ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఆయా అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తుందని అందరు అనుకుంటున్నారు. ఇక రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఔట్ పుట్ అంత ఎఫెక్టివ్ గా రాలేదని ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో గొడవ పెట్టుకున్నాడట. ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య మాటలు లేవంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇక కేజిఎఫ్, సలార్ లాంటి రెండు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధించిన ఆయనతో జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే గొడవ పెట్టుకున్నాడా? అయినా ప్రశాంత్ నీల్ మేకింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎన్టీఆర్ కి నచ్చకపోవడానికి గల కారణం ఏంటి? ఎన్టీఆర్ వేరే లెవల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? ఇక వీళ్ళిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు చెడిపోయాయా..?
ఈ సినిమా ఉంటుందా? ఆపేస్తారా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియాలో భారీ సక్సెస్ సాధించలేదు. ప్రశాంత్ నీల్ తనకి భారీ సక్సెస్ ని కట్టబెడతాడు అనుకుంటే ఇప్పుడు ఈ సినిమా కూడా ఎన్టీఆర్ కు నిరాశనే మిగిల్చబోతుంది అంటూ తన అభిమానులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఏదేమైనా కూడా రీషూట్స్ పెట్టి ఇప్పటివరకు చేసిన షూట్ మొత్తాన్ని మరోసారి క్రాస్ చెక్ చేసుకుంటూ డల్ అయిన సీన్స్ ను భారీ లేవల్లో ఎలివేట్ అయ్యే విధంగా సినిమాను తీర్చి దిద్దుతారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…