Star Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటివరకు స్టార్ హీరోలందరు వరుస సక్సెస్ లతో పాటు ఇండస్ట్రీ హిట్ల ను కూడా నమోదు చేసుకుంటున్నారు…ఇక వాళ్ల కెరియర్ లో ఒక్కసారైనా ఇండస్ట్రీ హిట్ సాధించిన హీరోలు మాత్రమే టాప్ పొజిషన్ కి వెళ్తారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ హిట్ ను సాధించిన వారే కావడం విశేషం… వాళ్లకు ఇండస్ట్రీ హిట్ అందించిన దర్శకులను ఆ తర్వాత కాలంలో వాళ్లు పట్టించుకోకపోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులను ఏర్పడ్డాయి. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? వాళ్లతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకులు ఎవ్వరు? వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయే దశకు చేరుకున్న ఆ దర్శకులు ఎవరు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
బి గోపాల్
బాలయ్య కి సమరసింహ రెడ్డి, నరసింహనాయుడు సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అలాగే ఇండస్ట్రీ హిట్ ని అందించిన ఈ దర్శకుడితో మరో సినిమా చేస్తానని చెప్పిన బాలయ్య ఆ తర్వాత పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా చేశాడు. ఈ సినిమా తర్వాత కూడా మరోసారి బి గోపాల్ చెప్పిన కథ తనకి నచ్చి సినిమా చేయాలని బాలయ్య అనుకున్నప్పటికి అది కార్యరూపం మాత్రం దాల్చలేదు. కారణం ఏదైనా ఇండస్ట్రీ హిట్ అందించిన బి గోపాల్ ను బాలయ్య సరిగ్గా పట్టించుకోలేదంటూ చాలా వార్తలైతే వచ్చాయి…
పూరి జగన్నాథ్
‘పోకిరి’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని అందించిన పూరి జగన్నాథ్ ఆ తర్వాత మహేష్ బాబుతో ‘బిజినెస్ మేన్’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొట్టాడు. ఇక ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో ‘జనగణమన’ సినిమా వస్తుందని పూరి జగన్నాథ్ గతంలో చెప్పినప్పటికి మహేష్ బాబు మాత్రం పూరి జగన్నాథ్ సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. కారణం ఏదైనా కూడా పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్ కి ఇండస్ట్రీలో చాలా గొప్ప బజ్ ఉంది… ఇండస్ట్రీ హిట్ ను అందించిన దర్శకుడిని మహేష్ బాబు పట్టించుకోకపోవడం పట్ల మహేష్ అభిమానులు సైతం కొంతవరకు ఆవేదనను వ్యక్తం చేశారు…
వివి వినాయక్
‘ఠాగూర్’ సినిమాతో ‘చిరంజీవి’ కి సూపర్ హిట్ ని అందించిన వినాయక్ ఆ తర్వాత చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా అని కూడా చేశాడు. ఈ సినిమా తర్వాత వినాయక్ కొంతవరకు డల్ అయ్యాడు. మరోసారి చిరంజీవి అవకాశం ఇచ్చి అతన్ని ఆదుకుంటే బాగుండేది. కానీ చిరంజీవి అతన్ని పట్టించుకోలేదు. ఇక ప్లాప్ డైరెక్టర్ అని ముద్రపడిన మెహర్ రమేష్ కి మాత్రం అవకాశం ఇచ్చాడు…