Prabhas Salaar 2: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి ప్రభాస్ గుర్తుకొస్తాడు. కారణం ఏంటి అంటే ఆయన చేసిన సినిమాలు ఆయనకు మంచి విజయాలను సాధించిపెట్టాయి. తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో తను కూడా చాలా వరకు హెల్ప్ చేశాడు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీని నామరూపాలు లేకుండా చేయడంలో ప్రభాస్ తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు… ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో తన పాగా వేశాడు.అలాగే అక్కడి ప్రేక్షకులను సైతం తన వైపు తిప్పుకున్నాడు. ప్రభాస్ హీరోగా రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ‘సలార్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు.
ఆ సినిమా అందుకున్న విజయంతో ఆయన మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ అయ్యాడు… ఇక ‘సలార్ 2’ సినిమా కూడా ఉంటుందని సలార్ మూవీ చివర్లో అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఇటు ప్రభాస్, అటు ప్రశాంత్ నీల్ ఇద్దరు బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్టు కొంత వరకు లేట్ అవుతోంది. 2027 వ సంవత్సరంలో ఈ సినిమాని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ లాభాల్లో పర్సంటేజ్ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది… సలార్ సినిమా కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకున్న ప్రభాస్ ‘సలార్ 2’ సినిమా కోసం మాత్రం లాభాల్లో వాటా అడగడం మీద హోంబలే పిక్చర్స్ వాళ్ళు సైతం పాజిటివ్ గానే స్పందించారట. ప్రభాస్ అందులో 25% తనకు ఇవ్వాలని అడిగినట్టుగా తెలుస్తోంది.
ఇక సలార్ 2 బడ్జెట్ 700 కోట్ల దాకా అవుతుందనే అంచనా ఉంది. ఇక ఈ సినిమా 2200 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబడుతుందనే అంచనాలో మేకర్స్ ఉన్నారు. ఈ లెక్కన వాళ్ళు పెట్టిన బడ్జెట్ పోయిన వాళ్లకు 1500 కోట్ల లాభాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక 1500 కోట్లలో 25% అంటే 350 కోట్ల పైన అతనికి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి… అందుకే ప్రభాస్ అలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది…ఇక ప్రభాస్ రోజు రోజుకి తన రేంజ్ ను మారుస్తుండటం విశేషం…