Trivikram: త్రివిక్రమ్ సినిమా మీద క్లారిటీ ఇవ్వలేని స్టార్ హీరోలు వీళ్లే…

గురూజీ మాత్రం ఇప్పుడు సినిమా స్టోరీలను రాసుకోవడం లో చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమం లోనే ఎలాంటి సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది...

Written By: Gopi, Updated On : May 23, 2024 10:57 am

Star Heroes who cannot give clarity on Trivikram movie

Follow us on

Trivikram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్… అయితే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుడిని అలరించడం లో చాలా వరకు సక్సెస్ అవుతూ ఉంటాయి. ఇక కొన్ని సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవ్వనప్పటికీ ప్రేక్షకులకు మాత్రం ఆయన సినిమాలు ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడా? లేదంటే ఎనర్జిటిక్ స్టార్ హీరో గా గుర్తింపు పొందిన రామ్ తో సినిమాలు చేస్తాడా అనే విషయం మీదనే సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఇప్పటికే రామ్ తో ఒక సినిమా అనుకొని మళ్ళీ ఆ సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు మాత్రం రామ్ తో ముందుగా సినిమా చేసి ఆ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడా మరి లేదంటే ముందుగా అనుకున్నట్టుగానే అల్లు అర్జున్ తో ఒక సినిమా కంప్లీట్ చేసిన తర్వాత రామ్ దగ్గరికి వస్తాడా అనే విషయాల మీద ఎలాంటి క్లారిటీ అయితే రావడం లేదు.

ఇంకా గురూజీ మాత్రం ఇప్పుడు సినిమా స్టోరీలను రాసుకోవడం లో చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమం లోనే ఎలాంటి సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక రీసెంట్ గా మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమా ఆశించిన మేరకు మంచి విజయాన్ని అయితే సాధించలేదు.

కాబట్టి ఆ సినిమాతో వచ్చిన బ్యాడ్ నేమ్ ని చెరిపేసుకోవాలి అంటే త్రివిక్రమ్ ఇప్పుడు వచ్చే సినిమాలతో సూపర్ సక్సెస్ సాధించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక స్టార్ హీరోలందరితో మంచి సక్సెస్ లను అందుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఆయన ఎదుర్కొంటున్న ట్రోలింగ్స్ కి చెక్ పెట్టాలంటే తను మరోసారి భారీ సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది…