https://oktelugu.com/

Fraud Calls: ఇలాంటి కాల్స్‌ వస్తున్నాయా అయితే జాగ్రత్త!

ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లు మోసాలకు కొత్త మార్గం ఎంచుకన్నారు. ఏకంగా ట్రాయ్‌ పేరుతోనే కాల్స్‌ చేస్తున్నారు. మెసేజ్‌లు పంపుతున్నారు. ఫోన్లు, సిమ్‌ కార్డులు బ్లాక్‌ అవుతాయని చెబుతూ.. ఓటీపీలు అడుగుతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 23, 2024 / 10:52 AM IST

    Fraud Calls

    Follow us on

    Fraud Calls: లోన్‌ కావాలా… ప్లాట్‌ కొంటారా.. క్రెడిట్‌ కార్డు కవాలా.. బంపర్‌ లాటరీ తగిలింది.. ఇలా పొద్దున లేచినప్పటి నుంచి ఫేక్‌ కాల్స్, ప్రమోషన్‌ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు పోన్లకు వస్తుంటాయి. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుక ట్రాయ్‌(టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా) అనేక చర్యలు తీసుకుంటుంది. స్పామ్‌ కాల్స్‌ రాకుండా టెక్నాలజీని టెలికం సర్వీస్‌ ప్రొవైడర్లు సమకూర్చుకోవాలని ఆదేవిస్తుంది. ఇటీవల ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సహాయంతో స్పామ్‌ ఫిల్టర్లను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్‌ నేరగాళ్లు కూడా కొత్త కొత్త మార్గాలు ఆన్వేశిస్తున్నారు.

    ట్రాయ్‌ పేరుతో కాల్స్‌..
    ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లు మోసాలకు కొత్త మార్గం ఎంచుకన్నారు. ఏకంగా ట్రాయ్‌ పేరుతోనే కాల్స్‌ చేస్తున్నారు. మెసేజ్‌లు పంపుతున్నారు. ఫోన్లు, సిమ్‌ కార్డులు బ్లాక్‌ అవుతాయని చెబుతూ.. ఓటీపీలు అడుగుతున్నారు. అయితే ట్రాయ్‌ నుంచి వచ్చిన కాల్‌ కావడంతో టెలిఫోన్‌ యూజర్లు స్పందిస్తున్నారు. వివరాలు వెల్లడిస్తున్నారు. దీంతో సైబర్‌ నేరగాళ్లు ఆ వివరాల ఆధారంగా ఖాతాలను ఊడ్చేస్తున్నారు. ఇలాంటి కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

    అపరిచిత కాల్స్‌కు స్పందించొద్దు..
    మన ఫోన్‌కు అపరిచిత నంబర్ల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌కు స్పందించకపోవడం చాలా మంచిదంటున్నారు నిపుణులు. ఫేక్, స్పామ్‌ కాల్స్‌కు స్పందించినా, మెస్సేజ్‌ లింక్స్‌పై క్లిక్‌ చేసిన మోసపోయే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్లకు స్పందించొద్దని సూచిస్తున్నారు. సైబర్‌ మోసానికి గురైతే 1930 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.