Heroes : సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ అయితే ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు ఈగో ప్రాబ్లంతో ఇతర హీరోలతో కలిసి నటించడానికి ఏమాత్రం ఆసక్తి చూపించరు. కానీ మరి కొంతమంది హీరోలు మాత్రం ఎలాంటి ఈగో లు లేకుండా మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి సైతం ఆసక్తి చూపిస్తూ ఉంటారు…ఇక మొత్తానికైతే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక సినిమా నటిస్తున్నారు అంటే అభిమానులు విపరీతమైన ఆనందాన్ని పొందుతూ ఆ సినిమాను చూసి ఎంటర్ టైన్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే మరి కొంతమంది హీరోలు మాత్రం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదుగుతున్నారు. ఇక ఈ మధ్య మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ ఎక్కువైపోయింది. నిజానికి ఒకప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు ఇబ్బంది పడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో మల్టీ స్టారర్ మూవీస్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. ప్రతి స్టార్ హీరో కూడా మంచి కథ దొరికితే ఇతర హీరోతో కలిసి నటించడానికి సిద్ధమయ్యారు. అయితే గత పది పదిహేను సంవత్సరాల నుంచి వెంకటేష్, నాగార్జున మాత్రం ఎవరితో అయినా సరే మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. నిజానికి మహేష్ బాబు ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమా చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, మసాలా లాంటి సినిమాలు చేశాడు. ఇక నాగార్జున సైతం నానితో దేవదాసు మంచు విష్ణుతో కలిసి కృష్ణార్జున సినిమా చేశాడు.
Also Read : ఇండియన్ ఇండస్ట్రీ లో టాప్ 5 హీరోస్ వాళ్లేనా..? అందులో మనవాళ్ళు ఉన్నారా..?
ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ ధనుష్ తో కలిసి కుబేర (Kubera) సినిమా చేస్తున్నాడు. ‘లోకేష్ కనకరాజ్’ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా వస్తున్న ‘కూలీ’ సినిమాలో ఎప్పుడూ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ను పోషిస్తున్నాడు. ఇలా ఎప్పుడైనా సరే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారనే చెప్పాలి…
మరి ఇప్పటివరకు వీళ్లు చేసిన సినిమాలు వీళ్ళకి మంచిగా గుర్తింపుని తీసుకొచ్చాయి. ఇక మీదట కూడా వీళ్ళు మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఒకప్పుడు స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపించేవారు.
మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ ఎక్కువ అవ్వడంతో ఎలాగైనా సరే ఇద్దరు హీరోలను కలిపి ఒక సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాలి. తద్వారా ఇండియాలో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేయాలనే ఉద్దేశ్యంతో దర్శకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే మంచి సినిమాలను చేస్తారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : ఆ హీరోలకు రెమ్యునరేషన్ భారీ గా ఉంది..కానీ హిట్టు కొట్టలేకపోతున్నారు..?