Malliswari: ‘మల్లీశ్వరి’ చిత్రంలో తాతగా నటించిన ఈ వ్యక్తి గుర్తున్నాడా..?ఇతని మనవడు ఎంత స్టార్ హీరోనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

'మల్లీశ్వరి' చిత్రం ఇప్పటి ఆడియన్స్ కి కూడా తెగ నచ్చేసింది. అందుకే ఈ సినిమా టీవీ టెలికాస్ట్ అయ్యినప్పుడల్లా టీఆర్ఫీ రేటింగ్స్ భారీగా వస్తుంటాయి. ఈ సినిమా ద్వారానే కత్రినా కైఫ్ సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

Written By: Vicky, Updated On : October 31, 2024 3:54 pm

Malliswari

Follow us on

Malliswari: విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ హిట్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి ‘మల్లీశ్వరి’. విజయ్ భాస్కర్ దర్శకత్వం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ఈ సినిమా 2004 వ సంవత్సరంలో భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. గతంలో విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి వెంకటేష్ ‘నువ్వు నాకు నచ్చావ్’ అనే చిత్రం చేసాడు. ఆ తర్వాత మళ్ళీ ఇదే కాంబినేషన్ లో ‘మల్లీశ్వరి’ చిత్రం ఇప్పటి ఆడియన్స్ కి కూడా తెగ నచ్చేసింది. అందుకే ఈ సినిమా టీవీ టెలికాస్ట్ అయ్యినప్పుడల్లా టీఆర్ఫీ రేటింగ్స్ భారీగా వస్తుంటాయి. ఈ సినిమా ద్వారానే కత్రినా కైఫ్ సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగిందో మన అందరికీ తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రంలో మల్లీశ్వరి (కత్రినా కైఫ్) కి తాతగా నటించిన వ్యక్తి గుర్తు ఉన్నాడా..?, సినిమాలో ఆయన ఉన్నది కాసేపే అయినా, ప్రేక్షకుల్లో బాగా గుర్తుండిపోయేలా నటించాడు. ఈ చిత్రానికి ముందు ఆయన ‘మన్మథుడు’ లో కూడా నాగార్జున కి తాతయ్యగా నటించాడు. ఈయన పేరు మన్నవ బాలయ్య. ఇప్పటి తరం ఆడియన్స్ కి ఆయన కేవలం ఈ రెండు సినిమాల ద్వారానే సుపరిచితం. కానీ ఆయన సీనియర్ మోస్ట్ నటుడు, డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్, నిర్మాత. 1953 వ సంవత్సరంలో ఆయన ‘ఎత్తుకి పై ఎత్తు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. అలా ప్రారంభమైన మన్నవ బాలకృష్ణ సినీ ప్రయాణం హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్టుగా కలిపి 350 కి పైగా సినిమాల వరకు సాగింది. 1930 వ సంవత్సరంలో జన్మించిన ఈయన 2022 వ సంవత్సరంలో ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాసని విడిచాడు. ఈయన వారసుడు కూడా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడు. అతని పేరు హరి కృష్ణ. ఈయన సీరియల్స్ లో స్టార్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు.

Malliswari(1)

ముఖ్యంగా స్టార్ మా ఛానల్ లో భారీ హిట్ గా నిల్చిన ‘గృహ లక్ష్మి’ సీరియల్ లో హీరో గా నటించింది ఈయనే. ‘నందు’ క్యారక్టర్ లో ఆయన జీవించి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యాడు. ఆ తర్వాత ఈయన ఈటీవీ లో ప్రసారమయ్యే ‘మౌన పోరాటం’, స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘పలుకే బంగారమాయే’ వంటి సీరియల్స్ లో నటించాడు. రీసెంట్ గానే ఈయన జెమినీ టీవీ లో కూడా ఒక కొత్త సీరియల్ లో నటించడానికి ఒప్పుకున్నాడు. ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న హరి కృష్ణ ఈమధ్య కాలంలో సినిమాల్లో కూడా కనిపిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో కూడా ఈయన్ని మనం గమనించొచ్చు.