Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ని యువ హీరోలు తమ సినిమాలలో రిఫరెన్స్ కి వాడుకుంటూ ఉండడం ఇది వరకు మనం చూసాము..ఇప్పటికీ ప్రతీ శుక్రవారం విడుదలయ్యే యువ హీరోల సినిమాలలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన రిఫరెన్స్ సీన్స్ కనిపిస్తూనే ఉంటాయి..ఇన్ని రోజులు కేవలం యువ హీరోలు మాత్రమే ఆయన క్రేజ్ ని వాడుకోవడం చూసాము..ఇప్పుడు టాప్ స్టార్స్ కూడా ఆయనని తెగ వాడేస్తున్నారు.

ఈ సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ వార్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అందరికి తెలిసిందే..తమిళ హీరో విజయ్ నటించిన ‘వారసుడు’, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మరియు నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీరసింహా రెడ్డి’ సినిమాలు పోటీ పడబోతున్నాయి..ఈ మూడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త.
తమిళం లో నెంబర్ 1 హీరో గా కొనసాగుతున్న విజయ్ ‘వారిసు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న చెన్నై లో కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది..సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు..త్వరలో తెలుగు లో జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చెయ్యాలి అనుకుంటున్నాడు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు.
ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిధిగా పిలవగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం..ఇక తర్వాత బాలయ్య బాబు హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి , మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు..త్వరలో వీటికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుంది.