Star Heroes Waiting For Hit Movies 2026: సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్టు వస్తే చాలు అనుకునే హీరోలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు కొంతమంది సక్సెస్ ల కోసం ఎదురుచూస్తున్నారు ఇంకా అందులో నాగార్జున కూడా ఉండడం విశేషం… నాగార్జున గతంలో చేసిన చాలా సినిమాలతో ప్రేక్షకులను తెప్పించాడు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న సినిమాలు ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించడం లేదు. కారణమేదైనా కూడా తను చేస్తున్న సినిమాలన్నీ నార్మల్ సినిమాలే కావడం వల్ల అవి ప్రేక్షకులను ఏమాత్రం ఇంపాక్ట్ కి గురి చేయడం లేదు. ఇక తను చేస్తున్న వందో సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు… తను అనుకున్నట్టుగానే ఆ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక నాగార్జున తో పాటుగా మరి కొంతమంది యంగ్ హీరోలు సైతం భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నారు.
అయినప్పటికి వాళ్ల వల్ల కావడం లేదు. నితిన్, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు సైతం చాలా రోజుల నుంచి ఒక్క సక్సెస్ వస్తే చాలు అని ఎదురుచూస్తున్నారు. నిజానికి ఒక సక్సెస్ తో ఇండస్ట్రీలో అన్ని మారిపోతాయి. భారీ సినిమాలు చేసే దర్శకులు, ప్రొడ్యూసర్లు వాళ్ల వెంట పడతారు. కాబట్టి ఇక్కడ హిట్ అనేది చాలా అవసరం…అది లేకపోతే ఎవ్వరు పట్టించుకోరు…
అందుకే ప్రతి ఒక్కరు దాని వెనకాల పరిగెడుతుంటారు… ప్రస్తుతం మన హీరోలందరు పాన్ ఇండియాలో తమ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటివరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా కొంతమందికి మాత్రమే విజయాలైతే వరిస్తున్నాయి.
ఇక సక్సెస్ లో ఉన్నవారు టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటే సక్సెస్ లో లేని వారు మాత్రం ఏదో ఒక రకంగా భారీ విజయాలను తమ ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు…ఇక ఈ సంవత్సరం మన స్టార్ హీరోల నుంచి వరుస సినిమాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక వాటికి తగ్గట్టుగానే వాళ్ళు ఇండస్ట్రీ హిట్స్ ను దక్కించుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది…