Mirai: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సబ్జెక్టులను సినిమాలుగా ఎంచుకుంటూ సూపర్ సక్సెస్ లను సాధించడంలో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక పాన్ ఇండియాలో వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తనదైన రీతిలో ప్రయత్నం చేస్తున్నారు. హనుమాన్, మిరాయి లాంటి సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన తేజ సజ్జ సైతం పాన్ ఇండియాలో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. ఆ సినిమా సూపర్ సక్సెస్ టాక్ ను సంపాదించుకున్నప్పటికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు మిరాయి లాంటి సక్సెస్ ఫుల్ సినిమాకి మాత్రం సపోర్ట్ చేయడం లేదంటూ చాలామంది రకరకాల కామెంట్స్ అయితే చేస్తున్నారు.
Also Read: రీతూ చౌదరి గ్రాఫ్ ని అమాంతం పెంచేసిన శనివారం ఎపిసోడ్.. ఇదేమి ధైర్యం బాబోయ్
కారణం ఏంటి అంటే ఇంతకుముందు సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి నటుడు సైతం బాలీవుడ్ లో వచ్చిన ‘సైయారా’ అనే సినిమా బాగుందంటూ ట్వీట్ అయితే చేశాడు. ఆ సినిమా పెద్ద కొత్తగా అయితే ఏమీ లేదు. ఇంతకుముందు మన తెలుగు సినిమాలు వచ్చినట్టే గానే ఉంది. అయినప్పటికి ఆ మూవీ బాగుందని ట్వీట్ చేశాడు.
మరి ఇప్పుడు మిరాయి సినిమా సనాతన ధర్మం గురించి తెరకెక్కింది. అయినప్పటికి ఈ సినిమా మీద అతను ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు. ఇక ఆయన ఒక్కడే కాదు మిగతా స్టార్ హీరోలు ఎవరు కూడా ఈ సినిమాని పట్టించుకోవడం లేదు. కారణం ఏంటి అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. మొత్తానికైతే తేజ స్టార్ హీరోగా రాణిస్తున్నాడనే ఉద్దేశ్యంతో ఏ హీరో కూడా అతనికి సపోర్ట్ చేయడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…
ఇక ఇప్పటికైనా తెలుగు సినిమాని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తే మన సినిమాలకు కూడా భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతాయి. తద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క స్టామినా పెరుగుతోంది తప్ప తగ్గదు. అలా కాకుండా వేరే సినిమాలకు సపోర్ట్ చేస్తూ మన సినిమాలను తక్కువ చేసుకోవడం వల్ల మనకే బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయని స్టార్ హీరోలందరికి తెలిసేలా సోషల్ మీడియాలో చాలామంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…