Bigg Boss 9 Telugu Ritu Chaudhary: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో అండర్ రేటెడ్ కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా రీతూ చౌదరి(Ritu Chowdary) ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అండర్ రేటెడ్ అంటే దక్కాల్సిన విలువ దక్కడం లేదని. చూసేందుకు ఎంతో అందంగా కనిపిస్తుంది, సోషల్ మీడియా లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ ఎందుకో ఆమె నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు తగిన స్థాయిలో ఓటింగ్ పడలేదు. ఈ వారం ఆమె డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరు అంటే ఎవరైనా నమ్ముతారా?, కానీ నిజంగానే ఆమె డేంజర్ జోన్ లో ఉన్నింది. ఈ వారం ఆమె నుండి మంచి కంటెంట్ అయితే వచ్చింది , కానీ ఎందుకో అది ఓటింగ్ లో రిఫ్లెక్ట్ అవ్వలేదు. కానీ నిన్నటి ఎపిసోడ్ మాత్రం రీతూ చౌదరి కి గేమ్ చేంజర్ లాగా అనిపించింది.
మాస్క్ మ్యాన్ హరీష్ కోసం సరైన సమయం లో ఆమె స్టాండ్ తీసుకొని నిలబడడం నిజంగా అందరినీ షాక్ కి గురి చేసింది. ఎందుకంటే హౌస్ మేట్స్ మొత్తం హరీష్ తప్పు చేసాడని అంటుంటే, ఆమె మాత్రం తానూ నమ్మిన దానిపైనే నిల్చొని తన వాయిస్ ని వినిపించింది. విషయం లోకి వెళ్తే హరీష్ మొన్నటి ఎపిసోడ్ లో ప్రియా తో మాట్లాడుతూ ‘ఇమ్మానుయేల్ నేను ఆడవాళ్లతోనే ఎక్కువగా మాట్లాడుతుంటాను అని అన్నాడు కదా, ఇన్ని రోజులు నేను తనూజ, భరణి, ఇమ్మానుయేల్ తో ఫైట్ చేసాను. వీరిలో ఒకరు అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు అని అనుకున్నాను కానీ, ముగ్గురు అమ్మాయిలతో ఫైటింగ్ చేసానని నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది’ అని చెప్తాడు. ఇక్కడ హరీష్ ఉద్దేశ్యం ఆడవాళ్లను తక్కువ చేయాలనీ కాదు, నేను పోట్లాడింది మగవాళ్ళతోనే కదా, ఆడవాళ్ళతో కాదు కదా అనేది ఆయన సెన్స్. కానీ దీనిని హౌస్ మేట్స్ అందరూ తప్పుగా అర్థం చేయూస్కున్నారు.
ఒక్క రీతూ చౌదరి మాత్రమే హరీష్ ఉద్దేశ్యం అది కాదు అని స్టాండ్ తీసుకొని నిలబడింది. ఇక్కడే ఆమె నూటికి నూరు మార్కులు కొట్టేసింది. నిన్నటి ఎపిసోడ్ తనూజ కి, మాస్క్ మ్యాన్ హరీష్ కి పాజిటివ్ ఎపిసోడ్ అనుకోవచ్చు. కానీ రీతూ చౌదరి కి మాత్రం బిగ్గెస్ట్ పాజిటివ్ ఎపిసోడ్. ఈ ఒక్క ఎపిసోడ్ తో ఆమె ఓటింగ్ గ్రాఫ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళిపోయి ఉండొచ్చని అంటున్నారు నెటిజెన్స్. తనకు అనిపించింది చేయడం, మనసులో ఉన్నది దాచకుండా ముఖం మీదనే చెప్పేయడం రీతూ చౌదరి లో ఉన్న లక్షణాలు. బయట ఉన్నప్పుడు కూడా ఆమె ఇదే మనస్తత్వం తో ఉండేది. ఇప్పుడు హౌస్ లోకి వచ్చిన తర్వాత నేడు ఆమె నిజమైన క్యారక్టర్ బయటపడింది. ఇక ఆమెకు తిరుగు ఉండకపోవచ్చని అంటున్నారు నెటిజెన్స్.