చరణ్ సినిమాలో స్టార్ హీరోలు !

మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ – విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో 40 నిమిషాల నిడివి కలిగిన ఓ పవర్ ఫుల్ పాత్ర ఉంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాలో ఆ ప్రత్యేకమైన పాత్ర కోసం అక్షయ్ కుమార్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఎలాగూ దర్శకుడు శంకర్ కి వివిధ […]

Written By: admin, Updated On : July 25, 2021 9:53 am
Follow us on

మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ – విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో 40 నిమిషాల నిడివి కలిగిన ఓ పవర్ ఫుల్ పాత్ర ఉంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాలో ఆ ప్రత్యేకమైన పాత్ర కోసం అక్షయ్ కుమార్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

ఎలాగూ దర్శకుడు శంకర్ కి వివిధ భాషలకు చెందిన పెద్ద నటుల్ని తీసుకోవడం అలవాటు కాబట్టి, ప్రాజెక్టుకు పాన్-ఇండియా అప్పీల్ ఈజీగా వస్తోంది. ఇప్పుడు అక్షయ్ కుమార్ లాంటి హీరో కూడా జాయిన్ అయితే, ఇక ఈ సినిమాకి బాలీవుడ్ లో కూడా తిరుగు ఉండదు. నిజానికి మొదట ఈ సినిమాలో ఈ ప్రత్యేక పాత్ర కోసం సల్మాన్ ను అడగాలని అనుకున్నారు.

కానీ, చరణ్ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి సల్మాన్ అంగీకరిస్తాడా అనే డౌట్ తో మేకర్స్ ఆ దిశగా అడుగులు వేయలేదు. అందుకే హిందీలో ఈ ప్రత్యేక పాత్ర కోసం అక్షయ్ కుమార్ ను అనుకుంటున్నారు. అలాగే, తమిళంలో ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతిని లేదా మాధవన్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట.

ఇక కన్నడ వెర్షన్ లో ఉపేంద్రని అడగాలని ప్లాన్ చేస్తున్నారు. మరి, తెలుగు వెర్షన్ లో ఎవర్ని తీసుకుంటారో చూడాలి. తెలుగులో ఈ పాత్ర కోసం అల్లు అర్జున్ లేదా నానిని తీసుకోవాలనేది చరణ్ టీమ్ ఆలోచన. ఇక తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గెటప్స్, మేకప్స్ లో చూపించే ఆనవాయితీ ఉన్న శంకర్, రామ్ చరణ్ ను ఈ సినిమాలో కొత్తగా చూపిస్తాడట.