Villains: టాలీవుడ్లో కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. పరాయి భాషలోని స్టార్ హీరోలను టాలీవుడ్ ఇండస్ట్రీ విలన్లుగా పరిచయం చేస్తోంది. ఇటీవల కాలంలో ఎంతోమంది స్టార్ హీరోలు తెలుగులో విలన్లుగా మారి సత్తా చాటుతున్నారు. హీరోకు ధీటుగా ఉన్న క్యారెక్టర్లో విలనిజాన్ని పండిస్తూ ఆ హీరోలంతా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమకు అచ్చివచ్చిన ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతూనే టాలీవుడ్లో మాత్రం విలన్లుగా నటిస్తూ బాగా సంపాదించుకుంటున్నారు.

ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు టాలీవుడ్ తెరపై విలన్లుగా పరిచయం అయ్యారు. తాజాగా కన్నడకు చెందిన దునియా విజయ్ సైతం నందమూరి బాలకృష్ణ సినిమాలో విలన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కన్నడలో దునియా విజయ్ కి యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు ఉంది. అలాంటి ఆయన బాలకృష్ణ సినిమాలో విలన్ గా నటిస్తూ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.
దీంతో ఇటీవలీ కాలంలో టాలీవుడ్ కు పరిచమైన స్టార్ హీరోల గురించి తెలుసుకునే అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. తమిళంలో భారీ క్రేజ్ ఉన్న హీరోల్లో విజయ్ సేతుపతి ఒకరు.అక్కడ స్టార్ హీరోగా కొనసాగుతున్న విజయ్ సేతుపతి తెలుగు మాత్రం విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. తమిళంలో పేట.. మాస్టర్ లాంటి సినిమాల్లో విలన్‌గా కన్పించిన విజయ్ తెలుగులో ‘ఉప్పెన’తో ఆకట్టుకున్నాడు. హీరోగా, విలన్ రాణిస్తున్న నటుల్లో విజయ్ సేతుపతి ముందువరుసలో నిలుస్తాడు.
కన్నడ నట చక్రవర్తిగా సుదీప్ సైతం తెలుగులో విలన్ అవతారం ఎత్తాడు. రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’లో సుదీప్ విలన్ గా అద్భుతంగా నటించాడు. విజయ్ ‘పులి’, సల్మాన్ ‘దబంగ్ 3’ మూవీల్లోనూ సుదీప్ విలన్ గా కన్పించాడు. తమిళ హీరో ఆర్య తెలుగులో విలన్ గా నటించాడు. అల్లు అర్జున్ ‘వరుడు’ మూవీలో ఆర్య విలనిజాన్ని పండించాడు. మలయంలో స్టార్ హీరోగా ఉన్న ఫహాద్ ఫాజిల్ అల్లు అర్జున్ ‘పుష్ప’లో విలన్ గా నటించాడు. ఈ సినిమా చివరి అర్ధగంటలో ఎంట్రీ ఇచ్చిన ఫహాద్ ఫాజిల్ తన క్యారెక్టర్లో జీవించాడు. పుష్ప-2లోనూ ఆయన ప్రధాన విలన్ గా కన్పించనున్నాడు.
బోజ్ పురికి చెందిన రవి కిషన్ అల్లు అర్జున్ నటించిన ‘రేసుగుర్రం’లో విలన్ గా కన్పించాడు. బోజ్ పురిలో రవి కిషన్ నెంబర్ వన్ హీరోగా కొనసాగుతుండం విశేషం. అయితే టాలీవుడ్ నిర్మాతలు భారీ రెమ్యూనరేషన్ ఇస్తుండటంతోనే వారంతా తెలుగులో విలన్లు నటిస్తున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో విన్పిస్తోంది. మొత్తంగా ఈ నటులంతా ఓవైపు హీరోలుగా కొనసాగుతూనే మరోవైపు విలన్లు రాణిస్తూ బీజీ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. దీంతో ఈ స్టార్స్ డేట్స్ దర్శక, నిర్మాతలకు దొరకడం కష్టంగా మారుతోంది.