Star Heroes Telangana language: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో టైం లో ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ యాసలో మాట్లాడితే చాలు ఆ సినిమా కచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుందనే నమ్మకం మేకర్స్ లో ఉండిపోయింది. అందువల్లే అవసరం ఉన్న లేకపోయిన ప్రతి డైరెక్టర్ తెలంగాణ యాస మీద కొన్ని సీన్స్ రాసుకోవడం వాటిని హీరోతో చెప్పించడం చూసే జనానికి చిరాకు తెప్పించడం చేస్తున్నారు. నిజానికి తెలంగాణ యాస మాట్లాడడం అంత ఈజీ కాదు. ఎవరు పడితే వాళ్లు మాట్లాడేంత ఈజీగా అయితే ఉండదు. దానికి చాలా కసరత్తులు చేయాలి. అలా లేకుండా ఏదో అరకొర జ్ఞానంతో మేము మాట్లాడింది సరైన స్లాంగ్ అంటే తెలంగాణ ప్రజలు తరిమి కొడతారు…నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్య కారణం కూడా తెలంగాణ యాస నే కావడం విశేషం…అలాంటి గొప్ప యాస ను కూణీ చేసి మాట్లాడుతూ ప్రేక్షకులను ముప్పు తిప్పులు పెడుతున్నారు. ఇక ఇంకా కొంతమందైతే కేవలం భూతులు తిట్టానికే తెలంగాణ స్లాంగ్ ను వాడుతున్నారు…నిజానికి హీరోలు నార్మల్ భాషలో మాట్లాడినా జనాలు సినిమాను చూస్తారు. కానీ వాళ్లకు రాని యాసలో మాట్లాడడం అది వాళ్లకు సరిగ్గా సెట్ అవ్వకపోవడంతో సినిమా చూడాలనే కోరిక కూడా సగటు ప్రేక్షకుడిలో కలగడం లేదు… ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ పోతినేని హైదరాబాద్ స్లాంగ్ లో మాట్లాడడానికి ట్రై చేశాడు. అయినప్పటికి అతనికి అంత పెద్దగా సెట్ అవ్వలేదు.
ఇక సినిమా ఫ్లో బాగుంది కాబట్టి ఏదో రకంగా సినిమాని చూసి సక్సెస్ చేశారు. ఇక డబుల్ ఇస్మార్ట్ లో కూడా అదే స్లాంగ్ లో మాట్లాడటం తో చిరాకు పుట్టిన జనాలు ఆ సినిమాను ఫ్లాప్ చేసి దొబ్బారు… ఇక మాస్ మహారాజా రవితేజ సైతం ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో తెలంగాణ యాసతో చిరాకు పుట్టించాడు. ఇక అక్కడితో ఆగుతుందేమో అనుకుంటే మరోసారి ‘మాస్ జాతర’ సినిమాలో యాసను మాట్లాడి ఆ సినిమా ప్లాప్ కి కారణం అయ్యాడు.
నిజానికి రవితేజను తెలంగాణ స్లాంగ్లో మాట్లాడమని చెప్పింది ఎవరు? స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడొచ్చు లేదంటే ఆంధ్ర యాస లో మాట్లాడిన పర్లేదు. నీకు రాని తెలంగాణ యాస మాట్లాడి ఎందుకయ్యా మా యాస పరువు తీస్తున్నారు… గతంలో దూకుడు సినిమా కోసం మహేష్ బాబు కొంతవరకు ట్రై చేశాడు. ఆ తర్వాత బాద్షా సినిమాలో ఎన్టీఆర్ మాట్లాడిన తెలంగాణ యాస అంత పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించలేదు…
‘ఎఫ్2’ సినిమాలో వరుణ్ తేజ్ మాట్లాడిన తెలంగాణ స్లాగ్ కూడా అంత బాగా సెట్ అవ్వలేదు. నిజానికి తెలంగాణ యాస అనేది ఆ ప్రాంతపు ప్రజల ఎమోషన్…దాన్ని రాంగ్ వే లో ప్రోజెక్ట్ చేయకండి… ఇప్పటికైనా తెలంగాణ స్లాంగ్ వదిలేసి ఆంధ్రా యాసలో మాట్లాడండి అలా అయితే మీ సినిమాలు కొంత వరకు చూడాలనిపిస్తోంది… లేదు మేము తెలంగాణ యాస లోనే మాట్లాడతాం అంటే మంచి ట్రైనర్ ను పెట్టుకొని నేర్చుకోండి…అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి తెలంగాణ యాస పరువు తీస్తాం అంటే ఎన్నో పోరాటాలు చేసి వచ్చిన తెలంగాణ జనాలు ఇప్పుడు మీ అందరిని ఉరికించుకుంటా కొడతరు… జాగ్రత్త…