ఉపాసన కామినేని కొణిదెల.. అపోలో హాస్పటల్స్ కు వైస్ చైర్మన్, పైగా అపోలో లైఫ్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా ఆమె తనకంటూ ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. ఇక ఎలాగూ మెగా కోడలు…అందుకే తాజాగా సినిమా ఇండస్ట్రీలో తన వ్యాపార ప్రతిభను చూపించడానికి ఉపాసన సన్నద్ధం అవుతున్నారు. కాకపోతే ఉపాసన ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నారు.
ఈ కరోనా మహ్మమారి కఠిన పరిస్థితులకు ఎదరు నిలుస్తూ భయంతో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వైద్యుల కోసం, వైద్య సిబ్బంది కోసం ఉపాసన ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మాణ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఉపాసన యువర్ లైఫ్ సంస్థను స్థాపించి పేదవారికోసం ఉచిత వైద్య సదుపాయం అందిస్తోంది.
పైగా సోషల్ మీడియాలో కూడా ఆరోగ్య ప్రాధాన్యతను అందరికీ తెలిసేలా ఉపాసన ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. ఈ క్రమంలోనే కరోనా వారియర్స్ త్యాగాలను, వారి కష్టాలను గుర్తు చేసేలా వారి ప్రస్తుత జీవితాలను ప్రతిబింబించేలా ఈ షార్ట్ ఫిల్మ్ ను నిర్మించనున్నారు ఉపాసన. ఇప్పటికే ఆమె కొంత మంది డైరెక్టర్లతో కూడా ఈ షార్ట్ ఫిల్మ్ గురించి చర్చించారట.
వారిలో త్రివిక్రమ్, సుకుమార్ లతో పాటు కొరటాల శివ పేరు కూడా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ లో హీరోగా రామ్ చరణ్ నటించబోతుండటం విశేషం. కోవిడ్ వారియర్ పాత్రలో చరణ్ నటించబోతున్నాడు. చరణ్ నటిస్తున్నాడు కాబట్టి, డైరెక్టర్ కూడా స్టార్ డైరెక్టర్ ఉండే అవకాశం ఉంది. అలాగే హీరో శర్వానంద్ కూడా ఒక పాత్రలో నటించే అవకాశం ఉంది. మరి ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఉపాసన చెప్పాలనుకున్న మెసేజ్ ఏమిటో చూడాలి.