టీడీపీ ఓటు బ్యాంకు పెరుగుతుందా?

టీడీపీ ఓటు బ్యాంకు చీలిపోతుందా? అంటే నిజమే అనిపిస్తుంది.పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ పార్టీకి కార్యకర్తలు, ఓటు బ్యాంకును కూడగట్టారు. దాంతో ఆయన విజయాల పరంపర అందుకున్నారు. కానీ ప్రస్తుతం టీడీపీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓటు బ్యాంకు తగ్గడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురవుతోంది.ఎన్టీఆర్ హయాంలో స్థిరమైన ఓటు బ్యాంకు ఉండేది. బీసీలు టీడీపీ వైపు ఆకర్షితులయ్యారు. కానీ చంద్రబాబు ఆ ఓటుబ్యాంకును కాపాడుకోలేకపోతున్నారు.ఫలితంగా అపజయాలు మూటగట్టుకుంటున్నారు. మరో వైపు వైసీపీ బలం క్రమంగా పెరుగతోంది. […]

Written By: Srinivas, Updated On : June 6, 2021 9:31 am
Follow us on

టీడీపీ ఓటు బ్యాంకు చీలిపోతుందా? అంటే నిజమే అనిపిస్తుంది.పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ పార్టీకి కార్యకర్తలు, ఓటు బ్యాంకును కూడగట్టారు. దాంతో ఆయన విజయాల పరంపర అందుకున్నారు. కానీ ప్రస్తుతం టీడీపీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓటు బ్యాంకు తగ్గడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురవుతోంది.ఎన్టీఆర్ హయాంలో స్థిరమైన ఓటు బ్యాంకు ఉండేది. బీసీలు టీడీపీ వైపు ఆకర్షితులయ్యారు. కానీ చంద్రబాబు ఆ ఓటుబ్యాంకును కాపాడుకోలేకపోతున్నారు.ఫలితంగా అపజయాలు మూటగట్టుకుంటున్నారు. మరో వైపు వైసీపీ బలం క్రమంగా పెరుగతోంది.

2019 ఎన్నికల్లో టీడీపీకి 37 శాతం ఓటింగ్ వచ్చింది. నాడు అధికారంలో ఉండి టీడీపీ ఎన్నికల్లో పాల్గొంది. దాంతో పాటు మళ్లీ అధికారంలోకి రావాలన్న కసితో పోరాడింది. దాని ఫలితంగా ఆ ఓట్ల శాతం నమోదు అయింది. అయితే 2022కి వచ్చే నాటికి అది కాస్త ముప్పై శాతానికి పడిపోయింది. ఏడు శాతం ఓట్ల కోత పడింది. తాజాగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో టీడీపీకి 30 శాతం ఓట్లు వచ్చాయి. అధికార పార్టీని ఢీకొట్టాలంటే ఓటు బ్యాంకు పెంచుకోవాల్సిన బాధ్యత టీడీపీపై ఉంది.

ఏపీలో వైసీపీ ఓటు బ్యాంకు చూస్తే యాభై శాతం పైనే ఉంది. స్థానిక ఎన్నికలతో పాటు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికను తీసుకుంటే ఈ విషయం తెలుస్తుంది. 2014 ఎన్నికల్లోకూడా వైసీపీకి 43 శాతం ఓట్లు వచ్చాయి. ఇక 2017 నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీకి 43 శాతం ఓట్లు దక్కాయి. ఇక నాడు జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచింది కానీ వైసీపీకి 40 శాతానికి తగ్గలేదు.

ఏపీలో జనసేనకు 5 శాతం ఓట్లు ఉన్నాయి. బీజేపీకి ఒక్క శాతం ఉంది. వామపక్షాలు కాంగ్రెస్ ను కలుపుకున్నా మరో శాతం కలుస్తుంది. అంటే టీడీపీ వీటితో కలిసినా 37 శాతానికి మించదు. మరో మూడేళ్లకు వైసీపీకి ఎంత వ్యతిరేకత వచ్చినా 45 శాతానికి తక్కువ కాకుండా ఓట్లువచ్చినా తటస్థ ఓటర్లు సైతం విపక్ష కూటమి మద్దతు ఇచ్చినా టీడీపీ కూటమి నలభై శాతానికి మించి ఓట్లు సాధించలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీకి పొత్తులతో వచ్చిన ఓట్ల శాతం 43 గా నమోదు అయింది.