Bollywood Star Hero: మన జీవితం మనం అనుకున్నట్లు ఉండదు. ఒక్కోసారి అదృష్టం కలిసొస్తే మరోసారి దురదృష్టం వెంటాడుతుంది. దీంతో ఏ పని కూడా కాదు. ఏది కూడా మన దరిచేరదు. లాభాలు వస్తాయనుకున్న సమయంలో నష్టాలు పలకరిస్తాయి. సంతోషంగా ఉందామనుకునే సమయంలో దుఖం బాధిస్తుంది. దీంతో మనకు ఏమీ అర్థం కాదు. మన జీవితం ఏంటి ఇలా సాగుతుందని అనుకోవడం తప్ప మరేమీ చేయలేం. ఇది అందరికి వర్తిస్తుంది. సెలబ్రిటీలైనా సామాన్యులైనా కాలం కలిసి రాకపోతే అంతే. మన పతనం ఖాయమే. దీనికి ఎవరు అతీతులు కారు. ఎంతటి వారైనా విధి వైపరీత్యాలకు తలవంచాల్సిందే.
బాలీవుడ్ సినీనటుడు అక్షయ్ కుమార్ గురించి అందరికి తెలిసిందే. మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్షయ్ కొద్ది కాలంగా నష్టాల్లో మునిగిపోతున్నాడు. తీసిన ప్రతి సినిమా బాక్సాఫీసు దగ్గర డీలా పడిపోతోంది. దీంతో నష్టాలే పలకరిస్తున్నాయి. పోయిన నష్టాలను భర్తీ చేసుకునే క్రమంలో తన ఇల్లును అమ్ముకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంత పెద్ద హీరోకైనా కష్టాలు తప్పలేదు. వరుసగా వచ్చిన ప్లాప్స్ తో ఇక భవిష్యత్ కష్టమేనని నమ్ముతున్నట్లు భావిస్తున్నాడు.

అక్షయ్ కుమార్ ప్రస్తుతం డిఫరెంట్ స్టోరీలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. మూస పద్ధతిలో కాకుండా కామెడీ సినిమాలను నమ్ముకుంటున్నాడు. కానీ సినిమాలు హిట్ కావడం లేదు. బాలీవుడ్ బాక్సాఫీసును దడదడలాడించిన బాద్ షా ప్రస్తుతం నష్టాల బాట పట్టడంతో ఇక ఏం చేసేదనే ఆలోచనలో పడిపోయాడు. తనకు నష్టాలు రావడానికి కారణాలేంటని ఆరా తీశాడు. దీనికంతటికి కారణం తాను గతంలో కొన్న ఓ బంగ్లా అని తెలుసుకున్నాడు. ప్రముఖ జ్యోతిష్యుడు సూచించిన దాని ప్రకారం దాన్ని అమ్మాలని డిసైడ్ అయ్యాడు.
ఇక దాన్ని అమ్మాలని నిర్ణయించుకుని ఎంత ధర వస్తే అంతకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. రూ. 12 కోట్ల విలువ చేసే బంగ్లాను కేవలం రూ. 6 కోట్లకే అమ్ముకున్నాడు. అక్షయ్ నటించిన బచ్చన్ పాండే, పృధ్వీరాజ్ చౌహాన్, రక్షాబంధన్ సినిమాలు వరుసగా అపజయాల పాలయ్యాయి. దీంతో అక్షయ్ నష్ట నివారణకు నడుం కట్టాడని తెలుస్తోంది. కానీ తక్కువ ధరకే ఇల్లు అమ్మేందుకు నిర్ణయించుకోవడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్ కుమార్ కూడా మూఢ నమ్మకాలు నమ్ముతాడా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.