Ram Charan Craze: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటిలో స్టార్ క్రికెటర్స్ ప్రత్యక్షమయ్యారు. ఫేమస్ క్రికెటర్స్ చరణ్ నివాసానికి రావడం నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ ఇమేజ్ విశ్వవ్యాప్తమైంది. పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన రామ్ చరణ్ ప్రతిభను హాలీవుడ్ ప్రముఖులు సైతం కొనియాడారు. అమెరికాలో ఆర్ ఆర్ ఆర్ వసూళ్ల వర్షం కురిపించింది. ఇక నెట్ఫ్లిక్స్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ 14 వారాలు టాప్ టెన్ లో కొనసాగింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటన గురించి అంతర్జాతీయ మీడియాలో సైతం వార్తలొచ్చాయి. ఆస్కార్ బరిలో ఆర్ ఆర్ ఆర్ హీరోలు ఉండే అవకాశం కలదని అంచనా కూడా వేశారు.

ఆర్ ఆర్ ఆర్ మూవీ విజయం నేపథ్యంలో రామ్ చరణ్ తెలియనివారంటూ లేరు. ఈ కారణంతోనే ఇండియన్ క్రికెటర్స్ రామ్ చరణ్ నివాసానికి వచ్చారు. సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య రామ్ చరణ్ ని నివాసంలో కలిశారు. చరణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవిని పాండ్య, సూర్య కుమార్ యాదవ్ కలిసి మాట్లాడారట. మెగా ఫ్యామిలీతో స్టార్ క్రికెటర్స్ కలవడం టాక్ ఆఫ్ ది ఇండిస్టీ అయ్యింది. వీరి మీటింగ్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

నిన్న హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియా-ఇండియా మధ్య అంతర్జాతీయ 20-20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా మ్యాచ్ సాగింది. యువ బ్యాట్ మెన్ సూర్య కుమార్ యాదవ్ 36 బంతుల్లో 69 కొట్టి ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. చివర్లో హార్దిక్ పాండ్య 16 బంతుల్లో 25 పరులు చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దీంతో భారత్ 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. మూడు టి20 ల సిరీస్ సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం రామ్ చరణ్ నివాసానికి హార్దిక్ పాండ్య, సూర్య కుమార్ యాదవ్ వచ్చారు. వాళ్లకు రామ్ చరణ్ సాదర ఆహ్వానం పలికి మంచి విందు భోజనం ఏర్పాటు చేసినట్లు సమాచారం.
మరోవైపు రామ్ చరణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆర్సీ 16 కి గ్యాప్ వచ్చిన నేపథ్యంలో ఆయనకు విరామం దొరికింది. దీంతో తన ఇద్దరు సిస్టర్స్ తో ఇటీవలే విదేశాల్లో విహరించి వచ్చారు. భారతీయుడు 2 షూటింగ్ తిరిగి ప్రారంభించిన దర్శకుడు శంకర్ రామ్ చరణ్ మూవీ పక్కన పెట్టాడు. దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తుండగా రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే లీకైన పిక్స్ అంచనాలు పెంచేవిగా ఉన్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది.