Prashanth Neel: కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కే జి ఎఫ్ (KGF) సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకర్షించాడు.ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సాధించడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. మదర్ సెంటిమెంట్ ని బేస్ చేసుకొని ఈయన సినిమాలు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా కేజీఎఫ్ సినిమాలో దాన్ని హైలైట్ చేయడం వల్ల ఈ సినిమాకి ఎనలేని గుర్తింపైతే వచ్చింది. ఇక ఆ తర్వాత ప్రభాస్(Prabhas) తో చేసిన సలార్ (Salaar) సినిమాలో కూడా మదర్ సెంటిమెంట్ ని వాడినప్పటికి దాన్ని కొంతవరకే వాడాడు…ముఖ్యంగా కాన్సెప్ట్ మీద దృష్టి పెట్టి ముందుకు సాగిన ఆయన సలార్ (Salaar) సినిమా మొదటి పార్ట్ ని సూపర్ సక్సెస్ గా నిలపాడు. తొందర్లోనే సలార్ 2 సినిమా కూడా తెరకెక్కబోతుంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ (NTR) ను హీరోగా పెట్టి డ్రాగన్ (Dragon) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో డైరెక్టర్ గా తనను తాను ఎలివేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే దీనికి కారణం. అయితే ఎన్టీఆర్ అభిమానులు సైతం ఎన్టీఆర్ కి ఇప్పటివరకు ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా లేదు.కాబట్టి ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ పడుతుందని వాళ్ళు చాలా మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరు ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నప్పటికి ఒకప్పుడు ప్రశాంత్ నీల్ ను రిజెక్ట్ చేసిన హీరోలు కూడా ఉన్నారనే విషయం మనలో చాలామందికి తెలియదు.
Also Read: అనిల్ రావిపూడి సక్సెస్ ల వెనక కారణం ఏంటంటే..?
తమిళ్ స్టార్ హీరో అయిన సూర్యతో ప్రశాంత్ ఒక సినిమా చేయాలని ప్రణాళికలు రూపొందించాడు. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇక మరికొంతమంది హీరోలతో సినిమాలు చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేసినప్పటికి వాళ్లు అతన్ని రిజెక్ట్ చేశారు.
మరి ఏది ఏమైనా కూడా కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న తర్వాత అందరు హీరోలు అతనితో సినిమా చేయాలనుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి… ఆయన సినిమాల్లో ఎలివేషన్స్ ని బాగా హ్యాండిల్ చేస్తూ హీరోని టాప్ పొజిషన్ లో నిలబెడుతూ ఉంటాడు.
Also Read: రాజమౌళి తన సినిమాలకు కీరవాణిని తప్ప వేరే మ్యూజిక్ డైరెక్టర్లను ఎందుకు తీసుకోడో తెలుసా.?
అందువల్లే అతని సినిమాలు చేసిన తర్వాత హీరోలకు భారీ ఇమేజ్ అయితే వస్తుంది… మరి ఇప్పుడు ఎన్టీఆర్ ని సైతం ఆ రేంజ్ లోనే చూపిస్తున్నాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…