https://oktelugu.com/

Victory Venkatesh: మరో రీమేక్ కి రెడీ అయిన వెంకటేష్… ఈసారి రానాతో పాటు

Victory Venkatesh: విక్టరీ వెంకటేష్ కామెడీ, సెంటిమెంటుతో ప్రేక్షకులను ఏడిపించగలరు అలానే నవ్వించగలరు.విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు వెంకీ. ఇటీవలే ఓటీటీ వేదికలో విడుదలైన ” నారప్ప ,దృశ్యం 2″ వంటి చిత్రాలతో విజయపథంలో దూసకుపోతున్నారు వెంకటేష్ . హిందీ తమిళం మలయాళం వంటి రీమేక్ చిత్రాలలో 25 పైగా నటించారు వెంకీ మామ. అలానే మల్టీ స్టార్ చిత్రాలలో నటించడానికి కూడా ఇష్టపడతారు అది చిన్న హీరో పెద్ద హీరో అనే వ్యత్యాసం చూపించారు వెంకటేష్.ప్రస్తుతం […]

Written By: , Updated On : December 6, 2021 / 07:34 PM IST
Follow us on

Victory Venkatesh: విక్టరీ వెంకటేష్ కామెడీ, సెంటిమెంటుతో ప్రేక్షకులను ఏడిపించగలరు అలానే నవ్వించగలరు.విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు వెంకీ. ఇటీవలే ఓటీటీ వేదికలో విడుదలైన ” నారప్ప ,దృశ్యం 2″ వంటి చిత్రాలతో విజయపథంలో దూసకుపోతున్నారు వెంకటేష్ . హిందీ తమిళం మలయాళం వంటి రీమేక్ చిత్రాలలో 25 పైగా నటించారు వెంకీ మామ. అలానే మల్టీ స్టార్ చిత్రాలలో నటించడానికి కూడా ఇష్టపడతారు అది చిన్న హీరో పెద్ద హీరో అనే వ్యత్యాసం చూపించారు వెంకటేష్.ప్రస్తుతం వెంకీ మామ దృష్టి మలయాళంలో హిట్ అందుకున్న “డ్రైవింగ్ లైసెన్స్‌” అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారట వెంకీ. ప్రస్తుతం ఆ పనుల్లో బిజీ అయ్యారు వెంకీ.

star hero victory venkatesh going to remake malayalam movie driving license

అయితే ఈ సినిమాకు సంబంధించిన హక్కులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దక్కించుకున్నారు. ఈ సినిమా లో వెంకటేష్ రవితేజ కాంబోలో ఈ
మల్టీ స్టార్ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆ మధ్యకాలంలో జోరుగా ప్రచారం జరిగింది.అయితే వెంకీ “దృశ్యం 2” వంటి చిత్రాల్లో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్టు కాస్త పక్కకు వెళ్లగా ప్రస్తుత ఇది లైన్ పెడుతున్నారు.ఇప్పుడు ఈ చిత్రం రామ్‌ చరణ్‌ నుంచి గీతా ఆర్ట్స్‌ చేతికి వచ్చిందని సమాచారం. వెంకటేశ్‌తో ఈ సినిమా తీయాలని గీతా ఆర్ట్స్‌ భావిస్తోందట. రవితేజ కోసం అనుకున్న పాత్రలో ఓ యంగ్‌ హీరోను తీసుకుంటారని సమాచారం. ప్రస్తుతం వెంకీ మామ “ఎఫ్‌ 3″తో పాటు “రానా నాయుడు” అనే వెబ్‌ సిరీస్‌తో బిజీగా ఉ‍న్నారు. దీని తర్వాత ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ నటించనున్నారట.