https://oktelugu.com/

Akhanda 2: అఖండ 2 కోసం విలన్ గా మారుతున్న స్టార్ హీరో…ఇలాంటివి బోయపాటికే మాత్రమే సాధ్యం అవుతాయా..?

తెలుగులో సినిమా ఇండస్ట్రీ లో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ నందమూరి నట సింహంగా గుర్తింపు పొందిన బాలయ్య బాబు కు ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. అందుకే ఆయనకి ఇప్పటికి కూడా మాస్ ఆడియెన్స్ లో చాలా మంచి క్రేజ్ అయితే ఉంది...

Written By:
  • Gopi
  • , Updated On : September 10, 2024 / 09:41 AM IST

    Akhanda 2

    Follow us on

    Akhanda 2: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ ఒక్కొ స్ట్రాటజీని అనుసరిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. కొంతమంది దర్శకులు మేకింగ్ పరంగా సినిమాని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని చూస్తుంటే, మరి కొంత మంది మాత్రం కథను బేస్ చేసుకొని సినిమాలను ముందుకు నడిపించే ప్రయత్నం అయితే చేస్తుంటారు. ఇక మొత్తానికి ఏది చేసినా కూడా ఆ సినిమా ప్రేక్షకుడికి నచ్చితే మాత్రం సినిమాను సూపర్ సక్సెస్ చేయడంలో ప్రేక్షకులు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే బోయపాటి లాంటి డైరెక్టర్లు వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకుంటున్నారు. ముఖ్యంగా బోయపాటి బాలకృష్ణ తో చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు మంచి విజయాలను అందుకొని వీళ్ళ కాంబోలో హ్యాట్రిక్ విజయాలను కూడా నమోదు చేసుకున్నాయి. ఇక ఇప్పుడు అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 అనే సినిమాను కూడా తెరకెక్కించే పనిలో బోయపాటి బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. బోయపాటి మాస్ సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక యంగ్ హీరోలకి సక్సెస్ లను ఇవ్వడంలో ఈ దర్శకుడు చాలా వరకు తడబడుతున్నప్పటికీ బాలయ్య బాబుకి మాత్రం భారీ సక్సెస్ లను ఇస్తున్నాడు. ఇక అందులో భాగంగానే వరుసగా నాల్గోవ సక్సెస్ ని కూడా సాధించడానికి బాలయ్య బాబుతో మరొక సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు…

    ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటేనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన కాంబినేషన్ గా ప్రేక్షకుల్లో ఒక మంచి గుర్తింపు అయితే సంపాదించుకుంది. మరి ఇలాంటి క్రమంలో బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో విలన్ గా ఎవరు నటించబోతున్నారు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. నిజానికి బోయపాటి సినిమాల్లో విలన్ కి చాలా ప్రత్యేకత అయితే ఉంటుంది. హీరోతో పాటు సమానమైన క్యారెక్టర్ ని పోషిస్తూ తన లోని విలనిజాన్ని చూపిస్తూ చాలా బాగా ఎలివేట్ అవుతూ ఉంటాడు.

    అందుకే బోయపాటి సినిమాల్లో విలన్ గా నటించడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. లెజెండ్ సినిమాతో జగపతిబాబుకి ఒక మంచి లైఫ్ ను ఇచ్చిన బోయపాటి అఖండ సినిమాలో శ్రీకాంత్ ని, సరైనోడు సినిమాలో ఆది పినిశెట్టి విలన్స్ గా మార్చి వాళ్లకు కూడా మంచి క్రేజ్ ని అందించాడు. ఇక బోయపాటి సినిమాలో హీరోలనే విలన్లు గా తీసుకుంటాడనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంకా ఇప్పుడు కూడా బాలయ్య బాబును ఢీ కొట్టడానికి ఒక యంగ్ హీరోని విలన్ గా చూపించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే హీరో కార్తికేయ ని అఖండ 2 లో విలన్ గా తీసుకోవాలనే ఉద్దేశ్యం లో బోయపాటి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే కార్తికేయ గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాలో కూడా నటించినట్లైతే ఆయనను మించిన విలన్ మరొకరు ఉండరు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. చూడాలి మరి కార్తికేయ ఈ సినిమాలో నటిస్తాడా లేదా అనేది…