Star Heroes Rejected The Nijam Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న హీరోలు మాత్రమే చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు లాంటి నటుడు సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా తెలుగులో ఆయనను సూపర్ స్టార్ గా నిలపాయి. ఇక ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాతో పాన్ వరల్డ్ ఇండస్ట్రీ మొత్తాన్ని శాసించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే కెరియర్ మొదట్లో ఆయన చేసిన కొన్ని సినిమాలు పెద్దగా ఆడలేదు. అయినప్పటికి ఆయన ఎక్కడ దిగులు చెందకుండా దృఢ సంకల్పంతో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగాడు. మరి ఈ క్రమంలోనే ఆయనకు ‘ఒక్కడు’ (Okkadu) లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ రావడంతో ఆ తర్వాత ఆయన వేణు తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగాడు…
ఇక మహేష్ బాబు (Mahesh Babu) తేజ(Teja) డైరెక్షన్లో చేసిన నిజం(Nijam ) సినిమాని మొదట పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అందులో ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాగా, మరొకరు నితిన్…జయం సినిమాతో తేజ డైరెక్షన్లో హీరోగా పరిచయమైన నితిన్ సైతం ఈ కథను విని ఆ కథ తనకు సెట్ అవ్వదని వదిలేసినట్టుగా తెలుస్తోంది.
Also Read : హిట్ అవ్వాల్సిన మన స్టార్ హీరోల సినిమాలు మధ్యలోనే ఆగిపోవడానికి కారణం ఏంటంటే..?
మరి మొత్తానికైతే మహేష్ బాబు ఈ సినిమాతో భారీ డిజాస్టర్ ని ముట్టుగట్టుకోవడమే కాకుండా ఒక్కడు సినిమాతో వచ్చిన ఇమేజ్ మొత్తం ఈ సినిమాతో డ్యామేజ్ అయిందనే చెప్పాలి…నటుడిగా తనకు గొప్ప గుర్తింపును తెచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ ని సాధించలేకపోయింది. ఇక దానికి మించి మహేష్ బాబు హీరోగా అంతకుముందే ఒక్కడు సినిమా రావడం ఈ సినిమా మీద భారీ ఎఫెక్ట్ ని కలిగించిందనే చెప్పాలి…
ఒక్కడు మూవీలో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధంగా సన్నివేశాలు ఉంటాయి. కానీ నిజం సినిమాలో మాత్రం మహేష్ బాబు ఒక పిరికివాడి పాత్రలో కనిపించడంతో అతని అభిమానులు ఆ పాత్రలో అతన్ని చూడలేకపోయారు. అందువల్లే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేక పోయింది అంటూ డైరెక్టర్ తేజ ఇప్పటికి చెబుతూ ఉంటారు…