Mass Jathara Movie: మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన ‘మాస్ జాతర’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి నిన్నటి నుంచి ప్రీమియర్ షో వేస్తున్నారు. మొదటి షో తోనే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని వసూలు చేస్తోంది అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్న రవితేజ అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు… గత కొన్ని సంవత్సరాల నుంచి రవితేజ ఒకే టెంప్లైన్ లో రొటీన్ కమర్షియల్ సినిమాలను చేస్తున్నాడు. ఇక ఆ కోవలకు చెందిందే ‘మాస్ జాతర’… దర్శకుడు భాను భోగవరపు కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు. తన డెబ్యూ మూవీ కి ఈ స్టోరీ అయితేనే వర్కౌట్ అవుతుందని అనుకోని రవితేజతో ఈ సినిమా చేశాడు. ఈ మూవీ ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోవడం విశేషం…
రవితేజ కంటే ముందే భాను ఈ సినిమా కథ ను మరో హీరోకి వినిపించారట. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే మ్యాచో స్టార్ గోపీచంద్…మొదట ఈ సినిమాని గోపీచంద్ తో చేయాలని దర్శకుడు భావించాడు. కానీ గోపీచంద్ ఇతర సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ చేయలేనని చెప్పేశారట. దాంతో భాను ఆ కథని రవితేజ దగ్గరికి తీసుకొచ్చాడు.
మొత్తానికైతే రవితేజ తో ఈ సినిమాను చేయించి అతని ఖాతాలో మరొక ఫ్లాప్ నైతే కట్టబెట్టాడు. ఇక ఏది ఏమైనా కూడా గోపీచంద్ ఈ సినిమాను రిజెక్ట్ చేసి చాలా మంచి పని చేశాడు అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ కూడా వరుసగా ప్లాప్ సినిమాలను చేస్తున్నాడు.
ఇక ఆయన ఖాతాలో మరో ప్లాప్ పడకుండా తప్పించుకొని మంచి పని చేశారంటూ మరి కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ 90% షూట్ కంప్లీట్ చేసుకుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ను తెరకెక్కించే పనిలో సినిమా యూనిట్ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది…