Mahesh Babu : ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి రెండోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…ఆయన తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఒకానొక సమయంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా సూపర్ స్టార్ ఇమేజ్ ని కూడా సొంతం చేసి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలో మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాని చేయడానికి సిద్ధమవుతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కావడం వల్ల ఈ సినిమా మీద చాలా ఆంచనాలైతే ఉన్నాయి. మరి అందరు దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కించి సక్సెస్ ని సాధించాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడి చేతిలో మహేష్ బాబు పడడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి. ఎందుకంటే మహేష్ బాబు రొటీన్ కథలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆయన వారి దగ్గర నుంచి సినిమా తీసేంతవరకు అన్నింటిలో చేంజ్ చేసుకొని చాలా పర్ఫెక్ట్ గా చెబుతూ ముందుకు దూసుకెళ్లే దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు.
కాబట్టి ఆయన లాంటి దర్శకుడు అయితేనే మహేష్ బాబు తనను తాను ఎలివేట్ చేసుకోగలుగుతారనేది మాత్రం వాస్తవం. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం రాజశేఖర్ ని సంప్రదించారు. కానీ రాజశేఖర్ అప్పటికి సోలో హీరోగా నటిస్తూ ఉండడం వల్ల ఆయన ఆ సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది.
ఒకవేళ సినిమాలో రాజశేఖర్ కనక చేసి ఉంటే ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా పలు రకాల సినిమాల్లో బిజీగా ఉండేవాడు. ఇక ఏది ఏమైనప్పటికి ఆ సినిమా చేయక పోవడం వల్లే రాజశేఖర్ ఇప్పుడు విలన్ గా పలు సినిమాల్లో చేద్దామన్న కూడా ఆయనకు అవకాశాలు అయితే రావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమాలో కూడా రాజశేఖర్ విలన్ గా నటించాలని చాలా ప్రయత్నం చేశాడు.
అయినప్పటికీ చిరంజీవి ఆ సినిమాలో తీసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు. దాంతో నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో నటించినప్పటికీ అది ఆయనకు పెద్దగా గుర్తింపైతే తీసుకురాలేకపోయింది…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More