https://oktelugu.com/

ప్రభాస్ ‘ఆది పురుష్’లో స్టార్ హీరో కొత్త లుక్ !

నేషనల్ స్టార్ ప్రభాస్ మొదటిసారిగా శ్రీరాముడిగా నటిస్తోన్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా “ఏ- ఆది పురుష్”. బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. సీతగా కృతి సనోన్‌ నటిస్తోంది. ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సైఫ్ పాత్ర పై ఆసక్తికర వార్త హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం సైఫ్ ఉన్న […]

Written By:
  • admin
  • , Updated On : January 6, 2021 / 10:09 AM IST
    Follow us on


    నేషనల్ స్టార్ ప్రభాస్ మొదటిసారిగా శ్రీరాముడిగా నటిస్తోన్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా “ఏ- ఆది పురుష్”. బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. సీతగా కృతి సనోన్‌ నటిస్తోంది. ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సైఫ్ పాత్ర పై ఆసక్తికర వార్త హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం సైఫ్ ఉన్న ఎత్తు కంటే ఇంకాస్త ఎత్తుగా చూపించడం కోసం స్పెషల్ మేకప్ మరియు వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ను వాడబోతున్నారట.

    Also Read: జాలు వారిన ‘వెన్నెల’కంటి కలం ఆగిపోయింది!

    అలాగే సైఫ్ అలీఖాన్ ముఖంలో కూడా చాలా మార్పులు తీసుకురాబోతున్నారని కూడా తెలుస్తోంది. ఇక ఇటీవల రావణుడిపై సైఫ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. శూర్ఫణఖకు లక్ష్మణుడు చేసిన అవమానానికి ప్రతీకారంగా రావణుడు సీతను ఎత్తుకుపోవడం సబబే అన్నట్టుగా తయారైంది ఆ వ్యవహారం. దాంతో చివరకు సైఫ్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది అనుకోండి. ఏది ఏమైనా ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ చాల కొత్తగా కనిపించబోతున్నాడు. సైఫ్ సినీ కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోనుంది.

    Also Read: ట్రైలర్ టాక్: ‘అల్లుడు అదర్స్’ అన్నీ కలగలిపేశాడే?

    అయితే మరో కీలక పాత్ర అయిన లక్ష్మణుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారు అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఓ దశలో ఈ పాత్ర కోసం కూడా మంచి హీరోను తీసుకోవాలని అనుకున్నారు. ఆ క్రమంలోనే తమిళ్ హీరో అథర్వా ను ఫైనల్ చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. అలాగే అడవి శేష్ ను కూడా అనుకున్నారట. కానీ తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ పాత్రలో ఇంకా ఎవ్వరూ ఫైనల్ కాలేదు. కాగా బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ఏ బాలీవుడ్ స్టార్ తోనో ఇలాంటి భారీ సినిమాను చేయకుండా, సౌత్ హీరో అయిన ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే. ఇక తన మార్కెట్ కి తగ్గట్లుగానే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను సెట్ చేసుకుంటూ ప్రభాస్ ముందుకు పోతున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్