Homeఎంటర్టైన్మెంట్Anchor Suma: సుమ " జయమ్మ పంచాయతీ " సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేసిన......

Anchor Suma: సుమ ” జయమ్మ పంచాయతీ ” సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేసిన… హీరో నాని

Anchor Suma: పాపులర్ యాంకర్, సుమ ప్రస్తుతం వెండితెరపై కనిపించబోతున్నారు. గతంలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది సుమ. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ బుల్లితెరకే పూర్తిగా పరిమితమయ్యారు. ఈ తరుణంలోనే సుమ ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రానికి ” జయమ్మ పంచాయితీ ” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ మూవీతో విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. అలాగే క‌థ, స్క్రీన్ ప్లే తో పాటు డైలాగ్స్ కూడా విజ‌య్ కుమార్ అందించాడు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా రాబోతోన్న ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు.

star hero nani released a song from suma jayamma panchayathi movie

విలేజ్ డ్రామాగా రాబోతోన్నఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల విడుదల చేశారు. కాగా ఈ ఫస్ట్ లుక్‌ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఇప్పుడు కొత్తగా మరో అప్డేట్ తో అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇస్తుంది మూవీ టీమ్.

తాజాగా  ఈ సినిమాలోని మొదటి పాట తిప్పగలనా? లిరికల్ వీడియోను నేచుర‌ల్ స్టార్‌ నాని విడుదల చేశారు. ఇందులో విలేజ్ వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు. ఈ పాటలో సుమ ఫ్యామిలీని కూడా చూపించడం విశేషం అని చెప్పాలి. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా రామ జోగయ్య శాస్త్రి ఈ పాట‌ను ర‌చించాడు. పీవీఎన్ఎస్ రోహిత్ ఈ సాంగ్ ను ఆలపించారు. సంగీత ప్రియులను ఈ పాట ఆక‌ట్టుకుంటోంది. విజువల్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

https://youtu.be/r2oEIK0IF5U

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version